Friday, May 3, 2024

Jammu Kashmir: కూలిపోయిన సైనిక హెలికాప్టర్

భార‌త ఆర్మీకి చెందిన ఓ హెలికాప్ట‌ర్ ఈరోజు కూలిపోయింది. జమ్ము కశ్మీర్ లోని గురెజ్ సెక్టార్లో హెలికాప్టర్ కూలిపోయిన ఘ‌టన చోటుచేసుకుంది. గురెజ్ ప్రాంతంలో గాయపడిన ఓ సైనికుడిని తీసుకువచ్చేందుకు వెళ్లిన చీతా హెలికాప్టర్ వాతావరణం అనుకూలించక వెనుదిరిగింది. ఆ తర్వాత కాసేపటికే ఎల్ఓసీ వద్ద ఆ హెలికాప్టర్ ప్రమాదానికి గురై కూలిపోయింది. ప్రమాదానికి గల కారణం ఏంటన్నది తెలియరాలేదని సైనికాధికారులు వెల్లడించారు. గురెజ్ సెక్టార్లోని గుజ్రన్ నల్లా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. సహాయక బృందాలు ఘటన స్థలికి పయనమయ్యాయి. ఈ ప్రమాదం నుంచి ఎవరైనా తప్పించుకున్నారేమో వెదికేందుకు ప్రత్యేక బృందాలు ఏరియల్ సర్వే చేపడుతున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement