Thursday, May 2, 2024

Dhami and Channi: ఇద్ద‌రు సీఎంల రాజీనామా..

ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో పంజాబ్, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రులు ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యలో ఇద్దరు సీఎంలు నేడు రాజీనామాలు సమర్పించారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో రెండు స్థానాల నుంచి పోటీ చేసిన సీఎం చ‌ర‌ణ్ జిత్ సింగ్ చ‌న్నీ రెండు చోట్లా ఘోరంగా ఓడిపోయారు. రాష్ట్రంలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్‌) రికార్డు సృష్టించింది. మొత్తం 117 సీట్లు పంజాబ్ అసెంబ్లీలో ఆప్ ఏకంగా 92 సీట్ల‌ను గెలుచుకుంది. దీంతో చ‌న్నీ పంజాబ్ సీఎం ప‌ద‌వికి రాజీనామా చేశారు.

మరోవైపు ఉత్త‌రాఖండ్‌లో బీజేపీ అధికారాన్ని నిపులకున్నా.. ఆ పార్టీకే చెందిన సీఎం పుష్క‌ర్ సింగ్ ధామి ఎన్నిక‌ల్లో ఓట‌మి పాలైయ్యారు. దీంతో ధామి కూడా శుక్ర‌వారం సీఎం ప‌ద‌వికి రాజీనామా చేశారు. ఉత్తరాఖండ్‌లో బీజేపీ వరుసగా రెండోసారి విజయం సాధించి చరిత్ర సృష్టించగా, ఖతిమా నుంచి ధామి ఓడిపోయారు. రాజ్‌భవన్‌ నుంచి వెళ్లిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసే వరకు ఆపద్ధర్మ సీఎంగా కొనసాగాలని గవర్నర్‌ కోరినట్లు వెల్లడించారు.

ఇది ఇలా ఉంటే.. కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, ధర్మేంద్ర ప్రధాన్‌లను పరిశీలకులుగా నియమించింది. వారు త్వరలో రాష్ట్రానికి చేరుకుంటారు. ఈ ఇద్దరు పరిశీలకులు సీఎం పదవికి కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల అభిప్రాయాన్ని తీసుకుంటారని బీజేపీ వర్గాలు వెల్లడించాయి. ఉత్తరాఖండ్‌లోని మొత్తం 70 స్థానాలకు ఫిబ్రవరి 14న ఒకే దశలో ఎన్నికలు జరిగాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement