Tuesday, May 14, 2024

ధరణి డేటా భద్రతపై కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆందోళన

తెలంగాణలో ధరణి వెబ్‌సైట్‌ నిర్వహణ ఫిలిప్పిన్స్‌ అనే ప్రైవేటు కంపెనీకి ఇచ్చారని అసెంబ్లీలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు అన్నారు. ధరణి డేటా ఓ ప్రైవేటు కంపెనీలో ఉండడం శ్రేయస్కరం కాదని చెప్పారు. ఈ మేరకు చట్టవిరుద్ధ కార్యక్రమాలకు ధరణిని వాడుకునే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ఇటిక్యాల రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని 500 ఎకరాల స్థలం ధరణిలో కనబడట్లేదని.. వెబ్‌సైట్‌, సర్వర్‌ కొందరికే ఉపయోగపడేలా ఉన్నాయని తెలిపారు. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని మన డేటా, సర్వర్‌ ప్రభుత్వ చేతిలోనే ఉండాలని కోరారు. భూదాన్‌ భూములపై విధానపరమైన నిర్ణయం తీసుకోవాలని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement