Friday, May 3, 2024

పండుగవేళ పరేషాన్​.. కారు బ్రేక్ వేయ‌బోయి యాక్సిలెట‌ర్ తొక్క‌డంతో! (వైరల్ వీడియో)

కొత్త కారు.. ఈమ‌ధ్య‌నే కొన్నారు. ద‌స‌రా పండుగ సంద‌ర్భంగా ఆయుధ పూజ కూడా చేయించారు. ఇష్ట దైవానికి మొక్కుకుని పూల‌దండ‌లు వేసి అందంగా ముస్తాబుచేశారు. అయితే.. ఆ కారు ఇంట్లో పార్కింగ్ కోసం తీసుకొస్తున్న వేళ ఆక‌స్మాత్తుగా యాక్సిడెంట్‌కు గుర‌య్యింది. గేటు నుంచి లోప‌లికి రాగానే పార్క్ చేయ‌డానికి తీసుకెళ్తుంటే వ‌రుస‌గా నిల‌బెట్టిన బైకుల మీదికి దూసుకెళ్లింది. కారు న‌డిపిన వ్య‌క్తి బ్రేక్ వేయ‌బోయి యాక్సిలెట‌ర్ గ‌ట్టిగా తొక్క‌డంతోనే ఇట్లా జ‌రిగింద‌ని వీడియో ద్వారా తెలుస్తోంది. చాలా సీరియ‌స్ ఇన్సిడెంట్ అయినా.. చూస్తుంటే మాత్రం ఫ‌న్నీగా అనిపిస్తోంది.. మీరూ చూసి యాక్సిడెంట్‌కి గ‌ల కార‌ణాలేంటో కామెంట్స్ రూపంలో తెలియ‌జేయండి.

వీడియో కోసం www.prabhanews.com లో చూడండి

Advertisement

తాజా వార్తలు

Advertisement