Saturday, May 4, 2024

హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం-ట్రాఫిక్ కి తీవ్ర అంత‌రాయం

హైద‌రాబాద్ లో ప‌లు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వ‌ర్షం కురిసింది. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో రేపు, ఎల్లుండి కూడా భారీ వర్షాలు కురుస్తాయ‌ని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పెద్ద అంబర్ పేట్.. హయత్ న‌గ‌ర్ , వనస్థలిపురం, ఎల్బీనగర్ మన్సూరాబాద్, దిల్ సుఖ్ న‌గ‌ర్ , చైతన్యపురి, కొత్తపేట,యూస‌ఫ్ గూడ‌..కృష్ణ‌న‌గ‌ర్ ప్రాంతాల్లో భారీ వ‌ర్షం కురిసింది. దీంతో ట్రాఫిక్ కి తీవ్ర అంత‌రాయం క‌లిగింది. పలు చోట్ల ట్రాఫిక్ జామ్ అయ్యింది. ప‌లుచోట్ల నాళాలు పొంగి నీరు వ‌ర‌ద‌లా ప్ర‌వ‌హిస్తోంది. వాహ‌న‌దారులు జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని పోలీసులు సూచ‌న‌లు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement