Monday, April 29, 2024

ఐదేళ్ల అద్వైత్ : బైక్ డ్రైవ్

ఐదు సంవ‌త్స‌రాల పిల్ల‌లు ఏం చేస్తారు.. న‌చ్చిన బొమ్మ‌లు లేదా తోటి పిల్ల‌ల‌తో ఆడుకుంటుంటారు. కానీ ఇక్క‌డ ఓ బుడ‌త‌డు ఏకంగా బైక్ పై చ‌క్క‌ర్లు కొడుతూ ఎంజాయ్ చేస్తున్నాడు.అది కూడా గంట‌కు 80,90కిలో మీట‌ర్ల వేగంతో దూసుకుపోతున్నాడు. అమీన్ పూర్ కి చెందిన అద్వైత్ కి నిజ‌మైన బైక్ మీద వెళ్ళ‌డం ఇష్టం. దాంతో అత‌డి తండ్రి రాహుల్ మూడు ల‌క్ష‌ల రూపాయ‌ల‌తో బుల్లి బైక్ ని కొనిచ్చాడు. అంతేకాదు డ్రైవింగ్‌లో శిక్షణ కూడా ఇచ్చాడు.

కొడుకును బైక్‌ రైడింగ్‌, రేసింగ్‌ పోటీలకు సిద్ధం చేస్తూనే.. ‘రేస్‌ విత్‌ లిటిల్‌ ఓం’ అనే యూ ట్యూబ్ ఛానల్‌ను నడుపుతున్నాడు రాహుల్‌. తన కొడుకు విన్యాసాలతోపాటు మిగతా పిల్లల బైక్‌లు, కార్లపై రివ్యూలనూ అప్‌లోడ్‌ చేస్తున్నాడు. ఇండియాలోనే ‘యంగెస్ట్‌ రైడర్‌’గా పేరు సాధించిన ఈ బుల్లి రేసర్‌ త్వరలోనే వరల్డ్‌ రికార్డ్స్‌లో స్థానం సంపాదించుకోవడానికి సిద్ధం అవుతున్నాడు. సూప‌ర్ క‌దా.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement