Friday, May 3, 2024

‘ఎంజాయ్ రేప్’ ఎమ్మెల్యే కామెంట్స్‌పై.. నిర్భయ తల్లి ఆశాదేవి సీరియస్..

క‌ర్నాట‌క‌ కాంగ్రెస్ ఎమ్మెల్యే రమేష్ కుమార్ అసెంబ్లీలో చేసిన ఎంజాయ్ రేప్‌ వ్యాఖ్యలు తీవ్ర క‌ల‌క‌లం రేపాయి. బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధి హోదాలో ఉండి అత్యాచారాన్ని ఎంజాయ్ చేయాలంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా నిర్భయ తల్లి ఆశాదేవి ఎమ్మెల్యే కేఆర్ రమేష్ కుమార్ వ్యాఖ్యలపై స్పందించారు. ఎమ్మెల్యే కేఆర్ రమేష్ అసెంబ్లీలో ఆ కామెంట్స్ చేసిన సమయంలో స్పీకర్ సహా మిగతా ఎమ్మెల్యేలంతా నవ్వడంపై ఆశాదేవీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘స్పీకర్ ఎందుకు నవ్వారు.. ఆ ఎమ్మెల్యే కామెంట్లను మిగతా ఎమ్మెల్యేలు ఎంజాయ్ చేశారు… నవ్వారు.. వారందరినీ అసెంబ్లీ నుంచి బహిష్కరించాలి.’ అని ఆశాదేవీ డిమాండ్ చేశారు.

‘ఓ పెద్దమనిషి.. తనను అత్యాచారం చేయండని చెబుతున్నాడు. అసలు అత్యాచారమంటే ఏంటో ఆయనకు తెలుసా.. ఆయన ఇంట్లో ఎవరైనా అత్యాచారానికి గురయ్యారా?’ అని స్పీకర్‌ను ఉద్దేశించి ఆశాదేవీ ఫైర్ అయ్యారు. అత్యాచారం అనివార్యమైనప్పుడు పడుకుని ఎంజాయ్ చేయాలంటూ కేఆర్ రమేష్ కుమార్ కామెంట్ చేయగా ‘ఇప్పుడు నేను ఎస్, ఎస్ అంటూ ఎంజాయ్ చేయాల్సిన పరిస్థితిలో ఉన్నా’ అని స్పీకర్ కగెరి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. సభాధ్యక్షుడైన స్పీకర్ ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యలు చేయడమేంటని ఆశాదేవీ మండిపడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement