Thursday, May 16, 2024

కేసీఆర్ పెళ్లి ఫోటో చూశారా?

తనకు చిన్నవయసులోనే పెళ్లయిందని సీఎం కేసీఆర్‌ చాలా సందర్భాల్లో చెప్పారు. అయితే ఆయన పెళ్లిలో ఎలా ఉండేవారో చాలామందికి తెలియదు. 1969 ఏప్రిల్ 23న వేములవాడ రాజరాజేశ్వరి స్వామి ఆలయంలో  కేసిఅర్,శోభమ్మ దంపతుల వివాహం జరిగింది. నేటికి 52 సంవత్సరాలు పూర్తి అయ్యింది. ఈ సందర్భంగా కేసీఆర్ దంపతుల పెళ్లి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో కేసీఆర్ చూడగానే గుర్తుపట్టేలాగానే ఉన్నారు. టీనేజ్ వయసులో ఉన్న కేసీఆర్, ఆయన భార్య శోభల ఫొటోలను సీఎం అభిమానులు షేర్ చేస్తున్నారు. వారికి వివాహ వార్షికోత్సవ శుభకాంక్షలు చెబుతున్నారు. ప్రస్తుతం కరోనా లక్షణాలతో కేసీఆర్ తన ఫామ్ హౌస్ లో చికిత్స పొందుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement