Friday, May 3, 2024

అధిక ఫీజులు వసూలు.. ప్రైవేట్ ఆస్పత్రుల పై కొరడా!

ఆంధ్రప్రదేశ్ లో కరోనా ఉగ్రరూపం దాల్చింది. ఈ నేపథ్యంలో కోవిడ్ బాధితులు ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలో పలు ప్రైవేట్ ఆస్పత్రులు రోగుల నుంచి అధిక సంఖ్యలో ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లా అధికారులు చర్యలు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా అధిక ఫీజులు వసూలు చేస్తున్న ఆసుపత్రులపై కొరడా ఝుళిపించారు. పలు ఆస్పత్రులను గుంటూరు జాయింట్ కలెక్టర్ రెవెన్యూ అధికారులు తనిఖీలు చేశారు. అమరావతి, విశ్వాస్, సురక్ష లైఫ్ ఆసుపత్రులకు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. ఆయా ఆస్పత్రులకు భారీ జరిమానా విధించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement