Monday, April 29, 2024

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో -40వెబ్ సిరీస్ లు-సినిమాలు

అమెజాన్ ప్రైమ్ ఓటీటీ స‌రికొత్త షోల‌తో అల‌రించేందుకు సిద్ధ‌మ‌యింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా పవర్ ప్యాకెడ్ క్రేజీ లైనప్ ని రెడీ చేసింది. వీక్షకుల కోసం రాబోయే రెండేళ్లలో స్ట్రీమింగ్ చేయబడే దాదాపు 40 వెబ్ సిరీస్ మరియు ఒరిజినల్ సినిమాలను ప్రకటించారు.తెలుగు.. తమిళ.. హిందీ సహా వివిధ భాషల్లో ఈ వెబ్ సిరీసుల‌ని .. సినిమాలు అందించనున్నట్లు అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ ప్రకటించింది. దీని కోసం కరణ్ జోహార్ ధర్మాటిక్ ఎంటర్టైన్మెంట్ – నిఖిల్ అద్వానీ ఎమ్మీ ఎంటర్టైన్మెంట్ – ఫర్హాన్ అక్తర్ ఎక్స్ఎల్ మీడియా – రాజ్ & డికే ఫిల్మ్స్ – నార్త్ స్టార్ స్టూడియో.. ఇలా పలు నిర్మాణ సంస్థలతో కలిసి ప్రైమ్ వీడియో ఈ షోలను రూపొందిస్తున్నట్లు తెలిపింది.

బాలీవుడ్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ హోస్ట్ గా గురువారం ముంబైలో జరిగిన స్పెషల్ ఈవెంట్ లో కొత్త ఒరిజినల్ షోలు అనౌన్స్ చేయబడ్డాయి. అలానే ‘మీర్జాపూర్’ ‘ది ఫ్యామిలీ మ్యాన్’ ‘పాతాళ లోక్’ ‘బ్రీత్ ఇన్ టూ షాడోస్’ వంటి పలు విజయవంతమైన వెబ్ సిరీస్ లకు సీక్వెల్ లను కూడా అమెజాన్ ప్రకటించింది. టాలీవుడ్ యువ హీరో యవసామ్రాట్ అక్కినేని నాగచైతన్య డెబ్యూ వెబ్ సిరీస్ ”దూత” ను అనౌన్స్ చేశారు. ఇదొక సూపర్ నేచురల్-హారర్ థ్రిల్లర్ వెవ్ సిరీస్. ‘మనం’ ఫేమ్ విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ ఒరిజినల్ ను నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇందులో ప్రియా భవానీ శంకర్ – పార్వతి తిరువోతు – ప్రాచీ దేశాయ్ – తరుణ్ భాస్కర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ షాహిద్ కపూర్ డెబ్యూ వెబ్ సిరీస్ ”ఫర్జీ”. ఇందులో విజయ్ సేతుపతి – రాశీ ఖన్నా – రెజీనా కసాండ్రా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఫ్యామిలీ మ్యాన్ సృష్టికర్తలు రాజ్ & డీకే ఈ సిరీస్ ని రూపొందిస్తున్నారు. అలానే తమిళ హీరో ఆర్య నటిస్తున్న ‘ది విలేజ్’.. టాలీవుడ్ హీరో నవీన్ చంద్ర – తమిళ నటుడు బాబీ సింహ కలిసి చేసిన ‘అమ్ము’ అనే ఒరిజినల్ సిరీస్ లను ప్రకటించారు.

సిద్దార్థ్ మల్హోత్రా – శిల్పా శెట్టి – వివేక్ ఒబేరాయ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న వెబ్ సిరీస్ ‘ఇండియన్ పోలీస్ ఫోర్స్’. రోహిత్ శెట్టి దర్శకత్వంలో ఈ ఒరిజినల్ తెరకెక్కుతోంది. అలానే ‘సజల్’ ‘హష్ హష్’ ‘ముంబయి డైరీష్’ ‘వదంతి’ ‘స్వీట్ కారం కాఫీ’ వంటి మరికొన్ని సిరీస్ లను అనౌన్స్ చేశారు. ‘పోర్ మరో షాట్స్ ప్లీజ్ 2’ – ‘బ్రీత్ ఇన్ టుది షాడోస్ 2’ – ‘ది ఫ్యామిలీ మ్యాన్ 3’ ‘మిర్జాపూర్ 3’ ‘పంచాయత్ 2’ ‘మేడ్ ఇన్ హెవెన్ 2’ ‘పాతాల లోక్ 2’ వంటి పలు సీక్వెల్స్ ను ప్రకటించారు.

‘మోడ్రన్ లవ్ హైదరాబాద్’ అనే తెలుగ షోకి ఉదయ్ గుర్రాల – నగేష్ కుకునూర్ – వెంకటేష్ మహా మరియు దేవికా దర్శకత్వం వహించనున్నారు. ఇందులో నిత్యా మీనన్ – ఆది పినిశెట్టి – రీతూ వర్మ – సుహాసిని మణిరత్నం – అభిజిత్ దుద్దాల – రేవతి – నరేష్ – మాళవిక నాయర్ – నరేష్ అగస్త్య – కోమలీ ప్రసాద్ – ఉల్కా గుప్తా తదితరులు నటిస్తున్నారు.

ఈ సిరీస్ ను ‘మోడ్రన్ లవ్ ముంబై’ ‘మోడ్రన్ లవ్ చెన్నై’ అనే పేర్లతో హిందీ – తమిళ భాషల్లో రూపొందించనున్నారు. ఇదే క్రమంలో అమెజాన్ ప్రైమ్ నిర్మాణ భాగస్వామిగా ఉన్న అక్షయ్ కుమార్ ‘రామసేతు’ చిత్రంతో పాటుగా ‘ఫోన్ భూత్’ ‘యుద్రా’ ‘జీలే జరా’ ‘ఫక్రీ 4’ ‘కోగయే హై హమ్ కహాన్’ వంటి సినిమాలను ప్రకటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement