Sunday, May 12, 2024

1st Test: 84 పరుగుల వద్ద రెండు వికెట్లు కోల్పోయిన ఆసీస్

నాగ్‌పూర్‌ వేదికగా భార‌త్ వ‌ర్సెస్ ఆస్ట్రేలియా జ‌ట్ల మ‌ధ్య‌ జరుగుతున్న తొలి టెస్టులో టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్‌ కమిన్స్‌ బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. ముందుగా బ్యాటింగ్ చేప‌ట్టిన ఆస్ట్రేలియా జ‌ట్టు రెండు పరుగులకే రెండు వికెట్లు కోల్పోగా.. ఆ తర్వాత 84 పరుగుల వద్ద వరుసగా మరో రెండు వికెట్లు కోల్పోయింది. ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్లు లబూసేన్ 49 పరుగులు చేసి జడేజా బౌలింగ్ లో స్టంప్ ఔటయ్యాడు. ఆతర్వాత వచ్చిన బ్యాట్స్ మెన్ రెన్ షా కూడా తర్వాత బంతికే ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యాడు. దీంతో ఆస్ట్రేలియా జట్టు 84 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement