Monday, April 29, 2024

15M రౌడీస్ ఆన్ ఇన్‌స్టా – విజ‌య్ దేవ‌ర‌కొండ క్రేజ్ మామూలుగా లేదుగా

ఇన్ స్టాగ్రామ్ లో యంగ్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ మ‌రో మైలురాయిని దాటారు. విజ‌య్ దేవ‌ర‌కొండ ఇన్‌స్టాగ్రామ్‌ ఫాలోవర్స్ సంఖ్య 15 మిలియన్లు దాటేసింది. ’15M రౌడీస్ ఆన్ ఇన్‌స్టా’ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు రౌడీ టీం. దీంతో విజయ్ అభిమానులు తమ అభిమాన హీరో ఈ ఫీట్ ను సాధించినందుకు సంతోషిస్తున్నారు. విజయ్ దేవరకొండ నటిస్తున్న ‘లైగర్’ ఆగష్టు 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘ధర్మ ప్రొడక్షన్స్’ బ్యానర్ సమర్పిస్తున్న ఈ స్టైలిష్ యాక్షన్ చిత్రానికి డాషింగ్ ఫిల్మ్ మేకర్ పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించారు. బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే ఈ చిత్రంలో విజయ్‌తో రొమాన్స్ చేస్తోంది. లెజెండరీ బాక్సర్ మైక్ టైసన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ బాక్సర్‌గా కనిపించనున్నాడు. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో రూపొందుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement