Thursday, May 9, 2024

Election: హిమాయల్​ప్రదేశ్​ ఎన్నికలకు కాంగ్రెస్​ రెడీ.. మేనిఫెస్టోలో ఏం ఉన్నాయంటే..

హిమాచల్​ ప్రదేశ్​ ఎన్నికల కోసం కాంగ్రెస్​ పార్టీ ఇవ్వాల తన మేనిఫెస్టోని ప్రకటించింది. అందులో ముఖ్యాంశాలను పార్టీ నేతలు శనివారం వెల్లడించారు. సమాజంలోని అన్ని వర్గాలను సంప్రదించిన తర్వాతే పార్టీ ఈ మేనిఫెస్టోను సిద్ధం చేసిందని కాంగ్రెస్‌ ఎన్నికల మేనిఫెస్టో కమిటీ చైర్మన్‌ ధనిరామ్‌ షాండిల్‌ అన్నారు. జర్నలిస్టులకు పెన్షన్​, ఆపిల్​ పంటకు మెరుగైన ధర వంటి అంశాలను మేనిఫెస్టోలో పొందుపరిచారు. రాష్ట్రంలో డ్రగ్స్ మహమ్మారిని అరికట్టేందుకు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో యాంటీ డ్రగ్ ఎన్‌ఫోర్స్ మెంట్ ఏజెన్సీని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

– ఇంటర్నెట్​ డెస్క్​, ఆంధ్రప్రభ

హిమాచల్​ ప్రదేశ్​ ఎన్నికల కోసం కాంగ్రెస్​ పార్టీ మేనేఫోస్టోని ప్రకటించింది. పాత పెన్షన్ స్కీమ్‌ను పునరుద్ధరించడం, 300 యూనిట్ల ఉచిత విద్యుత్, ₹ 680 కోట్ల స్టార్టప్ ఫండ్, లక్ష ఉద్యోగాలు, 18 నుండి 60 సంవత్సరాల మధ్య మహిళలకు నెలకు ₹ 1,500 పింఛన్​ అందజేయనున్నట్టు తెలిపింది.  నవంబర్ 12న జరిగే ఎన్నికల్లో సమిష్టి నాయకత్వంలో పోటీ చేస్తున్నామని, ఎన్నికైన ఎమ్మెల్యేలు, పార్టీ హైకమాండ్‌తో చర్చించిన తర్వాత ముఖ్యమంత్రి అభ్యర్థిని నిర్ణయిస్తామని పార్టీ తెలిపింది.

ప్రజల అంచనాలను అందుకోవడంలో బీజేపీ విఫలమైందని.. ఐదేళ్ల క్రితం ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని కాంగ్రెస్‌ ఎన్నికల మేనిఫెస్టో కమిటీ చైర్మన్‌ ధని రామ్‌ షాండిల్‌ ఆరోపించారు. ఇది కేవలం ఎన్నికల మేనిఫెస్టో మాత్రమే కాదని, హిమాచల్ ప్రదేశ్ ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం రూపొందించిన పత్రం అని షాండిల్ అన్నారు. ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ బఘేల్ సమక్షంలో ఈ మేనిఫెస్టోను విడుదల చేశారు. కార్యక్రమంలో హిమాచల్ ప్రదేశ్‌కు ఏఐసీసీ ఇన్‌చార్జి రాజీవ్ శుక్లా, కాంగ్రెస్ రాష్ట్ర మాజీ చీఫ్ సుఖ్‌విందర్ సింగ్ సుఖు, ఏఐసీసీ కార్యదర్శులు తేజిందర్ పాల్ బిట్టు, మనీష్ చత్రత్ తదితరులు పాల్గొన్నారు.

అధికారులను వేధించడానికి జైరామ్ ఠాకూర్ ప్రభుత్వం చేసిన అన్ని బదిలీలు రద్దు చేస్తామని, పండ్లు, పంటల ధరను నిర్ణయించే ఆపిల్ రైతుల ప్రాతినిధ్యంతో వ్యవసాయ.. సాగుదారుల కమిటీని ఏర్పాటు చేస్తామని శుక్లా చెప్పారు. ట్యాక్సీ డ్రైవర్లకు నామమాత్రపు ధరలకు రుణాలు అందజేస్తామని, పర్మిట్‌ కాలపరిమితిని 10 ఏళ్ల నుంచి 15 ఏళ్లకు పెంచుతామని కాంగ్రెస్‌ తమ మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. తుపాకీ లైసెన్సు ఫీజు తగ్గింపుతోపాటు రాష్ట్ర అప్పుల భారం తగ్గిస్తామని కూడా పొందుపరిచారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement