Friday, May 3, 2024

కారు టాప్ పై రిలాక్స్ డ్ గా పవన్ కల్యాణ్.. వైరల్ గా వీడియో

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇప్పటంలో పర్యటించారు. ఈ క్రమంలో మంగళగిరి పార్టీ కార్యాలయం నుండి
తన కాన్వాయ్ లో బయలుదేరిన పవన్…. ఇప్పటం గ్రామం చేరుకోకముందే మధ్యలోనే తాను ప్రయాణిస్తున్న కారు టాప్ పైకి ఎక్కారు. అనంతరం కారు టాప్ పై కాళ్లు బారజాపుకుని మరీ ఆయన రిలాక్డ్స్ డ్ గా కూర్చున్నారు. కారు వేగంగా దూసుకుపోతున్నా చలించని పవన్… కారుపై అలానే రిలాక్స్ డ్ గా కూర్చున్నారు. ఇక పవన్ కు రక్షణగా ఆయన అభిమానులు కారుకు ఇరువైపులా అలా నిలబడి ముందుకు సాగారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన పవన్ ఫ్యాన్స్ ”మనల్ని ఎవడ్రా ఆపేది” అనే ఓ కామెంట్ ను దానికి జత చేశారు. ఇక మరో వ్యక్తి ఇదే వీడియోను షేర్ చేస్తూ ”ఆ ఆటిట్యూడ్ చూడు తమ్ముడు” అని వ్యాఖ్యానించాడు. ఈ వీడియో వైరల్ గా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement