Thursday, May 16, 2024

మోడీ జీ… మా మన్ కీ బాత్ వినండి – మహిళా రెజ్లర్ల మొర

న్యూ ఢిల్లీ – భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌ పై కేను నమోదు చేయాలని కోరుతూ ఏడుగురు మహిళా రెజ్లర్లు ఢిల్లీ లోని జంతర్‌ మంతర్‌ వద్ద ఆదివారం నుంచి నిరసన చేస్తున్నారు.. అయినా ప్రభత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు.

దీంతో వీరంతా ప్రధాని మోదీని కలిసి తమ బాధను వివరిస్తామని తెలిపారు. ” ప్రధాని మోడీ సార్‌ మీరు బేటీ బచావ్‌.. బేటీ బచావ్‌ గురించి చెబుతారు. మన్‌ కీ బాత్‌ ద్వారా అందరితో మాట్లాడుతారు. అలానే మా మన్‌ కీ బాత్‌ కూడా వినలేరా?. దేశం కోసం పతకాలు సాధించిన సమయంలో మమ్మల్ని ఇంటికి ఆహ్వానించారు. ఈ రోజు మా బాధ చెప్పుకునేందుకు మరో అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాం.” అని ఒలింపిక్‌ పతక విజేత సాక్షి మాలిక్‌ కోరారు. నాలుగు రోజులుగా ఆందోళన వ్యక్తం చేస్తున్నా.. ఎందుకు మౌనంగా ఉన్నారని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీని వినేశ్ ఫొగట్‌ ప్రశ్నించారు. మా ఆవేదన పెద్దలకు చేరడం లేదనకుంటా.. అందుకే మేమంతా ప్రధానిని కలిసి మా బాధ వ్యక్తం చేయాలనుకుంటున్నామని అన్నారు

మహిళా రెజ్లర్లకు న్యాయం జరిగే వరకు ఆందోళన విరమించేది లేదు. క్రీడాకారులుగా ఐకమత్యంగా రెజ్లర్లకు మద్దతు పలకాలని కోరుతున్నాం” అని బజరంగ్ పునియా విజ్ఞప్తి చేశారు

Advertisement

తాజా వార్తలు

Advertisement