Sunday, May 19, 2024

Big Breaking: ఇంగ్లండ్‌పై టీమిండియా ఘ‌న విజ‌యం, సిరీస్ కైవ‌సం.. సెంచరీతో ఆదుకున్న పంత్

ఇంగ్లండ్‌తో జ‌రిగిన మూడు వ‌న్డేల సిరీస్‌లో టీమిండియా అద్భుత ప్ర‌ద‌ర్శ‌న చూపింది. బ్యాటింగ్‌, బౌలింగ్ విభాగాల్లో టాప్ క్లాస్ ఆట‌తీరుతో క్రికెట్ అభిమానుల‌ను ఆక‌ట్టుకుంది. అయితే.. ఈ సిరీస్‌లోనూ విరాట్ కోహ్లీపై అభిమానులు చాలా ఆశ‌లు పెట్టుకునున్నారు. కానీ, అంద‌రూ అనుకున్న స్థాయిలో అత‌ను మెప్పించలేక‌పోయాడు. ఈ మూడు వ‌న్డేల సిరీస్‌లొ తొలి వ‌న్డేలో బౌల‌ర్లు మిరాకిల్ చేశార‌నే చెప్ప‌వ‌చ్చు. బుమ్రా ఏకంగా ఆరు వికెట్లు తీసుకుని ఇంగ్లండ్ వెన్ను విరిచాడు. ఇక‌.. రెండో వ‌న్డేలో ఇంగ్లండ్ జ‌ట్టు త‌న ప్ర‌తాపాన్ని చూపింది. తామూ తీసిపోలేద‌ని, టీమిండియాకు దీటుగా ఆడి రెండో వ‌న్డేను గెలుచుకుంది.

కాగా, ఇరు దేశాల జ‌ట్ల‌కు కీల‌క‌మైన మూడో వ‌న్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ జ‌ట్టు 259 ప‌రుగులు చేసింది. దీంతో టీమిండియా 260 ప‌రుగుల టార్గెట్‌తో బ‌రిలోకి దిగింది. కాగా, ఓపెన‌ర్లుగా దిగిన రోహిత్ శ‌ర్మ (17), శిఖ‌ర్ ధ‌వ‌న్ (1) పెద్ద‌గా ఆక‌ట్టుకోలేక‌పోయారు. ఆ త‌ర్వాత బ‌రిలోకి వ‌చ్చిన కోహ్లీపై అంతా ఆశ‌లు పెట్టుకున్నారు. కానీ కోహ్లీ కూడా (17) త్వ‌ర‌గానే పెవిలియ‌న్ చేరాడు. దీంతో టీమిండియా కీల‌క‌మైన మూడు వికెట్ల‌ను స్వ‌ల్ప స్కోరుకే చతికిలపడింది.

ఆ త‌ర్వాత బ్యాటింగ్‌కు వ‌చ్చిన రిష‌బ్ పంత్‌, సూర్య‌కుమార్ జ‌త‌క‌లిసి ఆడుతున్న‌క్ర‌మంలో సూర్య‌కుమార్ (16) త్వ‌ర‌గానే అవుట‌య్యాడు. దీంతో టీమిండియా ఇబ్బందిక‌ర ప‌రిస్థితుల్లోకి జారుకుంది. మ్యాచ్ ఇంగ్లండ్ చేతిలోకి వెళ్లింద‌నుకున్న త‌రుణంలో హార్ధిక్‌పాండ్యా వ‌చ్చి జ‌ట్టుకు ఊపిరి పోశాడు. పంత్‌తో క‌లిసి స్కోరు బోర్డును ప‌రుగులు పెట్టించారు. వీరిద్ద‌రి ఆట‌తీరుతో అభిమానుల్లో మ‌ళ్లీ ఆశ‌లు పెరిగాయి. కాగా, పాండ్యా (71) ప‌రుగుల వ‌ద్ద అవుటుకాగా, పంత్‌కు రవీంద్ర జడేజా 7, తోడ‌య్యాడు. ఈ క్ర‌మంలో పంత్ త‌న సెంచ‌రీ పూర్తి చేసుకుని 125 పరుగులతో నాటౌట్‌గా నిలిచి ఇండియాను విజ‌య‌తీరాల‌కు చేర్చాడు. టీమిండియా ఇంగ్లండ్​పై 5 వికెట్ల తేడాతో గెలిచి సిరీస్​ కైవసం చేసుకుంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement