Wednesday, May 8, 2024

సన్‌రైజర్స్ ఓనర్ కావ్య మారన్ ఓ బిలియనీర్..

ఐపీఎల్ 2021 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ లు జరిగేటప్పుడు అందరి కన్నా ఒకే ఒక్కరు ఎక్కువగా అందరి దృష్టిని తన వైపు తిప్పుకుంటారు. ఆ ఒక్కరే కావ్య మారన్.

ప్రతీ మ్యాచ్‌కు హాజరై తన టీమ్ గెలవాలని తన హవాభావాలతో ప్రేక్షకులను అలరిస్తుంటుంది. ఎంతలా అంటే మైదానంలో బ్యాట్స్‌మెన్ ఫోర్ కొట్టినా.. బౌలర్ వికెట్ తీసినా టీవీ కెమెరాలు ఆమెనే పదేపదే చూపించేంత. జట్టు మంచి స్థితిలో ఉన్నప్పుడు ఆమె కొట్టే కేరింతలు.. ఓడినప్పుడు బుంగ మూతి పెడుతూ ఆమె ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఆమె హవాభావాలన్నీ మీమ్స్‌గా నెట్టింట హల్‌చల్ చేస్తుంటాయి. అయితే ఫ్యాన్స్ కూడా కనీసం మా కావ్య పాప కోసమైనా మ్యాచ్ గెలవండ్రా అని ఆ టీమ్ ఫ్యాన్స్ కోరెంత కనెక్ట్ అయ్యారు. హైదరాబాద్ మ్యాచ్ ఉందంటే అందరి చూపులు కావ్య మారన్‌పైనే. ఆమె కోసమే మ్యాచ్ చూసేవాళ్లు ఉన్నడనంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

ఈ సీజన్‌లో వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఓడిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లో విజయం సాధించి బోణీ కొట్టింది. అయితే హైదరాబాద్ టీమ్ మ్యాచ్ ఓడిన.. ఫ్యాన్స్ ను అలరించడంలో కావ్య మారన్ ఎప్పుడు గెలుస్తుూనే ఉంటారు. మాత్రం మ్యాచ్ లోను కావ్య మారన్ చేసే సందడికి ఫ్యాన్స్ మత్రముగ్ధులవుతారు.

సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం. 2.3 బిలియర్ డాలర్ల ఆస్థికి ఏకైక వారసురాలు కావ్యమారన్. సన్ నెట్ వర్క్ అధినేత కళానిధి మారన్, కావేరి మారన్ దంపతుల ముద్దుల తనయే ఈ కావ్య మారన్. ఆమె 1992 ఆగస్టు 6న చెన్నైలో జన్నించారు. బిజినెస్ మీద ఆసక్తితో కావ్య ఎంబీఏ చేసింది. ఏవియేషన్, మీడియా అంటే ఆమెకు చాలా ఇష్టం. దాంతో తన తండ్రి బిజినెస్‌ల్లోని సన్ మ్యూజిక్, ఎఫ్‌ఎం చానల్స్‌ను చూసుకుంటుంది. త్వరలో సన్‌గ్రూప్‌ను టేకప్ చేయబోతుంది.

ఇక సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ ఏకైక ఓనర్ కళానిధి మారన్. అతని నెట్ వర్త్ 2021 ప్రకారం 2.3 బిలియన్ డార్లుగా ఉంటుందని ఫోర్బ్స్ ప్రకటించింది. ఈ 2.3 బిలియర్ డాలర్ల ఆస్థికి ఏకైక వారసురాలు కావ్యమారనే. అంతే కాదు వీరి ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ కూడా చాలా పెద్దదే..కావ్య వాళ్ల తాత మురసోలి మారన్, డీఎంకే పార్టీ నుంచి యూనియన్ మినిస్టర్‌గా పనిచేశారు. కావ్య వాళ్ల బాబాయి దయానిధి మారన్ మాజీ లోక్‌సభ ఎంపీ. తమిళనాడు మాజీ సీఎం కరుణానిది కావ్య వాళ్ల తాతయ్యకు సొంత మామయ్య.

Advertisement

తాజా వార్తలు

Advertisement