Saturday, May 4, 2024

SA vs Ind 2nd Test : సఫారీలపై టీమిండియా సూపర్ విక్టరీ

కేప్‌ టౌన్ వేదికగా జరిగిన రెండో టెస్టు మ్యాచ్ లో టీమిండియా 7వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. రెండు మ్యాచ్ ల సిరీస్ ను 1-1తో డ్రా గా ముగించింది. కాగా దక్షిణాఫ్రికా-భారత్ జట్ల మధ్య జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్ లో సఫారీలపై టీమిండియా జట్టు సూపర్ విక్టరీ సాధించింది. అయితే ఆ తర్వాత బ్యాటింగ్ చేపట్టిన భారత్ జట్టు 153 పరుగులకు ఆలౌట్ కాగా.. 98 పరుగుల ఆధిక్యంలో భారత్ జట్టు ఉంది. సౌతాఫ్రికా జట్టు రెండో ఇన్నింగ్స్ లో 176 పరుగులకు ఆలౌట్ అయ్యింది. దీంతో సౌతాఫ్రికా జట్టు 78 పరుగుల ఆధిక్యంలోకి రాగా… రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్ చేపట్టిన భారత్ జట్టు 12 ఓవర్లలో 3వికెట్లు కోల్పోయి 7 వికెట్ల తేడాతో విజయలక్ష్యాన్ని ఛేదించింది.

టాస్ గెలిచిన సౌతాఫ్రికా జట్టు ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే మొదటి ఇన్నింగ్స్ లో సౌతాఫ్రికా జట్టు 55పరుగులకే ఆలౌట్ అయ్యింది. రెండో ఇన్నింగ్స్ లో బుమ్రా ధాటికి సౌతాఫ్రికా 176 పరుగులకు కుప్పకూలింది. మార్క్రమ్ శతకం చేయడంతో ఆ మాత్రం స్కోర్ చేయగలిగింది. భారత్ తొలి ఇన్నింగ్స్ లో 153 పరుగులు చేయగా, రెండో ఇన్నింగ్స్ లో మూడు వికెట్ల నష్టానికి 80 పరుగులు చేసింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement