Tuesday, May 7, 2024

టీ20 ప్రపంచకప్‌ ఫేవరేట్‌ టీమిండియా

టీ20 ప్రపంచకప్‌ టోర్నమెంట్‌లో టీమిండియా ఫేవరేట్‌ అని పాకిస్తాన్‌ ఆల్‌రౌండర్‌ షాహిద్‌ అఫ్రిది పేర్కొన్నారు. రాబోయే టీ20 ప్రపంచకప్‌ను గెలవబోయే జట్లలో టీమిండియా ఒకటని అన్నాడు. ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లో భారత బౌలింగ్‌ గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ రోహిత్‌ సేనపై ప్రశంసలు కురిపించాడు. ఇంగ్లండ్‌పై టీ20 సిరీస్‌ విజయానికి భారత ఆటగాళ్లు అర్హులని అఫ్రిది అభిప్రాయపడ్డాడు. ఈ మేరకు ట్విట్టర్‌లో ట్వీట్‌ చేశాడు. ”భారత జట్టు ఈ మ్యాచ్‌లో అద్భుతంగా ఆడింది. ఈ సిరీస్‌ విజయానికి వాళ్లు అర్హులు. ముఖ్యంగా భారత జట్టు బౌలింగ్‌ ఆకట్టుకుంది. ఆస్ట్రేలియా వేదికగా అక్టోబర్‌లో జరుగబోయే టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు ట్రోఫీ నెగ్గే సత్తా ఉన్నా జట్లలో హాట్‌ ఫేవరేట్‌ అనడంతో సందేహం లేదు” అని పేర్కొన్నాడు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement