Saturday, May 11, 2024

IPL | ముంబై, హైదరాబాద్​ మ్యాచ్​.. ఉప్పల్​ స్టేడియంలో జోష్!

ఐపీఎల్ 16వ సీజ‌న్‌ 25వ మ్యాచ్‌లో ఇవ్వాల (మంగళవారం) స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్, ముంబై ఇండియ‌న్స్ తలపడనున్నాయి. హైదరాబాద్​లోని ఉప్పల్​ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్​పై రెండు జట్లు కన్నేశాయి. కాగా, ​ టాస్​ గెలిచిన సన్​ రైజర్స్ హైదరాబాద్​ జట్టు ఫీల్డింగ్​ ఎంచుకుంది.. దీంతో ముంబై ఫస్ట్​ బ్యాటింగ్​కు దిగనుంది.

ఇక.. ఈ రెండు టీమ్‌లు ఓట‌మితో టోర్నమెంట్‌ను ఆరంభించాయి. ఆ త‌ర్వాత కాస్త వేగం పెంచి, వరుస‌గా రెండు విజ‌యాలు సాధించాయి. ఇవ్వాల జరిగే మ్యాచ్​తో ఇరుజ‌ట్లు మూడో విజ‌యంపై క‌న్నేశాయి. ఇక.. సొంత గ్రౌండ్‌లో పంజాబ్ కింగ్స్‌ను చిత్తు చేసిన మ‌ర‌క్రం సేన ముంబైని ఓ ప‌ట్టు ప‌ట్టేందుకు రెడీ అయ్యింది. గ‌త మ్యాచ్‌లో కోల్‌క‌తాకు షాకిచ్చిన ముంబై అదే జోరు కొన‌సాగించాల‌ని అనుకుంటోంది. ఇట్లా.. ఎవ‌రి గేమ్​ ప్లాన్​ వారికుండగా.. ఒకరిపై ఒకరు పైచేయి సాధించాలనే ఆశతో బరిలోకి దిగనున్నారు. ప‌రుగుల వ‌ర‌ద పారే ఈ స్టేడియంలో విజేతగా నిలిచేది ఎవ‌రో మ‌రికొన్ని గంట‌ల్లో తేలనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement