Tuesday, May 7, 2024

Sports | క్వార్టర్‌ ఫైనల్‌కు మెద్వెదేవ్‌, రైబాకినా

రష్యా మూడవ సీడ్‌ డానియల్‌ మెద్వెదేవ్‌ తొలిసారి వింబుల్డన్‌ క్వార్టర్‌ ఫైనల్‌కి చేరుకున్నాడు. ప్రత్యర్థి జిరి లెహెక్కా 6-4, 6-2 తేడాతో వెనుకబడిన సమయంలో, గాయంతో రిటైర్‌ అయ్యాడు. సెమీఫైనల్స్‌లో గ్రీకు వీరుడు స్టెఫానోస్‌ సిట్సిపాస్‌ లేదా అమెరికా అన్‌సీడ్‌ ప్లేయర్‌ క్రిస్టోఫర్‌ యుబాంక్స్‌తో తలపడతాడు. మహిళల సింగిల్స్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ ఎలెనా రైబాకినా తదుపరి రౌండ్‌కు చేరింది. ప్రత్యర్థి బీట్రిజ్‌ హద్దాద్‌ మైయా గాయంతో ఏడుస్తూ నిష్క్రమించింది. వెన్నునొప్పికి చికిత్స కోసం టైమ్‌ అవుట్‌ తీసుకునే సమయానికి రైబాకినా 3-1 ఆధిక్యంలో ఉంది. కొద్దిసేపటి తర్వాతి తిరిగి కోర్టులోకి అడుగుపెట్టినా పూర్తి సన్నద్ధత చూపలేదు. రిటైర్‌ కావడానికి ముందు ఐదవగేమ్‌లో నొప్పిని భరించలేక కన్నీళ్లు పెట్టుకుంది. ఇక సెమీస్‌లో ఒన్స్‌జబీర్‌ లేదా క్విటోవాతో రైబాకినా పోటీపడనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement