Sunday, May 5, 2024

Sports | ప్రి-క్వార్టర్స్‌కు బోపన్న జోడీ

పురుషుల డబుల్స్‌లో భారత టెన్నిస్‌ స్టార్‌ రోహన్‌ బోపన్న, ఆస్ట్రేలియన్‌ భాగస్వామి మాథ్యూ ఎబ్డెన్‌ మూడవ రౌండ్‌కు చేరుకున్నారు. సోమవారం జరిగిన మ్యాచ్‌లో వరుస గేమ్‌లలో విజయం సాధించి ప్రి క్వార్టర్స్‌కు చేరుకున్నారు. ఆరవ సీడ్‌గా బరిలోకి దిగిన బోపన్న, ఎబ్డెన్‌లు బ్రిటీష్‌ జోడీ జాకబ్‌ ఫియర్నీ, జోహన్స్‌లను ఓడించారు. గంటకుపైగా సాగిన పోరులో 7-5, 6-3 తేడాతో గెలుపొంది రౌండ్‌-16లోకి ప్రవేశించారు. మంగళవారం జరిగే ప్రి క్వార్టర్‌ ఫైనల్‌లో డచ్‌ – అమెరికన్‌ జోడీ డేవిడ్‌ పెల్‌, రీస్‌ స్టాల్డర్‌తో తలపడనున్నారు. 43ఏళ్ల బోపన్న జోడీ ఈఏడాది ప్రారంభంలో ఖతార్‌ ఓపెన్‌తోపాటు ఇండియన్‌ వెల్స్‌ టైటిళ్లు గెలుచుకున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement