Monday, April 29, 2024

కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ రెండు వికెట్స్ డౌన్ – 29/2

ఐ పీఎల్ 2023 సీజన్‌లీగ్ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ అమీతుమీ తేల్చుకోంటున్నాయి. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఢిల్లీ ఫీల్డింగ్ ఎంచుకుంది.. బ్యాటింగ్ కు దిగిన కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ కు ఆదిలోనే ఎదురు దెబ్బ త‌గిలింది.. లింట‌న్ దాస్, వెంక‌టేష్ అయ్య‌ర్ లు వెంట‌వెంట‌నే అవుల‌య్యారు.. లింట‌న్ వికెట్ ముఖేష్ కుమార్, అయ్యార్ వికెట్ నోకియాకు ల‌భించాయి.. లింట‌న్ 4 ప‌రుగులు చేయ‌గా, అయ్య‌ర్ డ‌కౌట్ గా వెనుతిరిగాడు .. ప్ర‌స్తుతం నాలుగు ఓవ‌ర్లో రెండు వికెట్ల న‌ష్టానికి 29 ప‌రుగులు చేసింది. కాగా, ఇప్పటివరకు అన్ని జట్లు కనీసం రెండు మ్యాచ్ లలో అయినా విజయాలు సాధించగా.. వార్నర్‌ సేన ఇప్పటివరకు బోణీ కూడా కొట్టలేదు. ఆడిన ఐదు మ్యాచ్ లలో వరుసగా 5 మ్యాచ్‌లో ఓడిపోయి ప్లేఆఫ్స్ అవకాశాలను క్లిష్టం చేసుకుంది. ప్లేఆఫ్‌ రేసులో నిలవాలంటే ఢిల్లీ జట్టు గెలుపు బాట పట్టాల్సిన అవసరం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement