Saturday, May 4, 2024

సబ్‌స్క్రిప్షన్ ధరలను తగ్గించిన నెట్‌ఫ్లిక్స్.. వివరాలివే !

ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ భారతదేశంతో సహా 100కు పైగా దేశాల్లో తన సబ్‌స్క్రిప్షన్ ధరలను గణనీయంగా తగ్గించాలని నిర్ణయించింది. ఈ ఓటీటీ పోర్టల్ కు భారత దేశంలో గణనీయమైన సంఖ్యలో సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు.. అయితే ధరలను తగ్గిస్తూ తీసుకున్న ఈ నిర్ణయం ఖచ్చితంగా ఆ సంఖ్యను మరింత పెంచుతుందని సంస్థ యజామాన్యం భావిస్తుంది. ఆసియా, యూరప్, లాటిన్ అమెరికా, సబ్ సహారా ఆఫ్రికా, మధ్య ప్రాచ్యంలోని మొత్తం 116 దేశాల్లో నెట్ ఫ్లిక్స్ ధరలు తగ్గించింది.

ఈ సంవత్సరంలో మార్చితో.. ముగిసిన మూడు నెలలకు నెట్‌ఫ్లిక్స్ ప్రపంచ నికర ఆదాయం చూసుకుంటే 1,305 మిలియన్ డాలర్లకు (సుమారు రూ. 107 కోట్లు) పడిపోయింది.. ఇది అంతకుముందు సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే దాదాపు 18% తగ్గినట్టు తెలుస్తోంది. ఇంతకు ముందు.. నెలకు రూ.199 గా ఉన్న నెట్ ఫ్లిక్స్ మొబైల్ ప్లాన్ ఇప్పుడు రూ.149 కే లభించనుంది. దీంతో పాటు బేసిక్ సబ్‌స్క్రిప్షన్ ధర రూ.499కి బదులు రూ.199గా ఉండబోతుంది.

ఇతర ఓటీటీ ప్లాట్ ఫామ్ లతో పోల్చి చూస్తే నెట్ ఫ్లిక్స్ ధరలు కాస్త ఎక్కువగానే ఉంటాయి. వాస్తవానికి నెట్ ఫ్లిక్స్ నెలవారీ సబ్‌స్క్రిప్షన్ ధరలు కొన్ని ఇతర ఓటీటీ పోర్టల్స్ వార్షిక సబ్స్క్రిప్షన్ కంటే ఎక్కువగా ఉండటం గమనార్హం. తాజాగా తీసుకున్న ఈ ధరల తగ్గింపు నిర్ణయం నెట్ ఫ్లిక్స్ కి చాలా బాగా పని చేస్తుంది అనే చెప్పాలి. ఈ గ్లోబల్ దిగ్గజం ఖచ్చితంగా ఈ నిర్ణయంతో వారి సబ్‌స్క్రిప్షన్ బేస్ ను పెంచుకుంటుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement