Thursday, May 2, 2024

స్పేస్ ఎక్స్ ప్రయోగం విఫలం.. ఆకాశంలోకి ఎగిరిన కొద్దిసేపటికే కుప్పకూలిన రాకెట్..

అమెరికాకు చెందిన ఎలాన్ మస్క్ నేతృత్వంలోని ప్రైవేట్ అంతరిక్ష పరిశోధన సంస్థ స్పేస్ ఎక్స్. ఇవ్వాల ఒక రాకెట్ ని నింగిలోకి పంపే ప్రయత్నం చేయగా స్టార్ షిప్ ఫెయిలయింది. అంతరిక్ష రంగంలో గొప్ప మలుపు అనుకున్న ప్రయోగం విఫలమయింది. మస్క్ యాజమాన్యంలోని స్పేస్ ఎక్స్ తయారు చేసిన స్టార్ షిప్..  సూపర్ హెవీ స్పేస్ షిప్.  అంతరిక్షంలోకి భారీ పేలోడ్స్‌ను తీసుకెళ్లడంతో పాటు కుజగ్రహంపైకి మనుషులను కూడా పంపించడానికి  ఈ ప్రయోగం ఎంతో ఉపయోగపడేది. ఫాల్కన్ 9 రాకెట్ల తయారీకి ఉపయోగించిన సాంకేతిక పరిజ్ఞానాన్నే ఈ స్టార్ షిప్ సూపర్ హెవీ నిర్మాణానికీ వినియోగించారు. 

టెక్సాస్‌లోని లాంచ్ ప్యాడ్‌ నుంచి దీన్ని అంతరిక్షంలోకి ప్రయోగించారు. స్టార్ షిప్ ఆకాశంలోకి ఎగిరిన కొద్ది సేపటికే కుప్పకూలిపోయింది. తాము ఎంతో నేర్చుకున్నామని తర్వాత ప్రయోగం కొద్ది నెలల్లో ఉంటుందని మస్క్ ప్రకటించారు. రాకెట్ లిఫ్ట్ ఆఫ్, బూస్టర్ వేరుపడటం, మళ్లీ అది భూమికి చేరుకోవడంపైనే దీని భవిష్యత్తు ఆధారపడి ఉందని స్పెస్ ఎక్స్ ప్రయోగానికి ముందు వివరించింది. కానీ లిఫ్ట్ ఆఫ్ అయిన వెంటనే పేలిపోవడంతో స్పేస్ ఎక్స్ కు భారీ నష్టం జరిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement