Wednesday, May 15, 2024

Breaking | పోరాడి ఓడిన భారత్​.. 66 పరుగుల తేడాతో ఆసీస్​ విజయం

ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో భారత్​ ఆది నుంచి తడబాటుకు గురయ్యింది. 353 పరుగుల టార్గెట్​ని ఛేజింగ్​ చేసే క్రమంలో త్వర త్వరగా వికెట్లను కోల్పోయింది. ఈ క్రమంలో 66 పరుగుల తేడాతో భారత్​పై ఆసిస్​ జట్టు విజయం సాధించింది. కాగా, తొలుత ఆస్ట్రేలియా బ్యాటింగ్​ చేయగా టీమిండియాకు భారీ టార్గెట్ సెట్​ చేసింది. ఆసీస్​ జట్టు నిర్ణీత ఓవర్లలో 352 పరుగులుచేయగా ఇండియా 353 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగింది. అయితే.. టాప్​ ఆర్డర్​ పర్వాలేదు అనిపించినా మిడిలార్డర్​ పెద్దగా ఆటతీరు కనబర్చలేదు. దీంతో నిర్ణీత ఓవర్లలో ఇండియా స్కోరు 286 పరుగులకు ఆల్​ అవుట్​ అయ్యింది.

ఇందులో రోహిత్​ (81), వాషింగ్టన్​ సుందర్​ (18), కోహ్లీ (56), రాహుల్​ (26), సూర్యకుమార్​ (8) పరుగులు చేశారు. శ్రేయస్​ అయ్యర్ ((48), రవీంద్ర జడేజా (35), పరుగులు చేయగా.. మిగతా టెయిలెండర్స్​ సింగిల్ డిజిట్స్​కే అవుటయ్యారు.  ఈ మ్యాచ్​లో ఆసిస్​ బౌలర్​ గ్లెన్​ మ్యాక్స్​వెల్​కు నాలుగు వికెట్లు దక్కగా, హాజిల్​ వుడ్​ 2, మిచ్చెల్​ స్టార్క్​ 1, పాట్​ కమిన్స్​ 1, తన్వీర్​ సంగ్హా 1 వికెట్​ తీసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement