Monday, May 6, 2024

TS | కోర్టు ఆవరణలో వ్యక్తిపై దాడి.. నిందితుడు న్యాయవాదికి జరిమానా!

మంచిర్యాల, (ప్రభన్యూస్): మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కోర్టు ఆవరణలో ఓ వ్యక్తిపై దాడికి పాల్పడి, కులం పేరుతో దూషించినందుకు గాను న్యాయవాది, మంచిర్యాల బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కొత్త సత్తయ్యకు రూ.5వేల జరిమానా విధిస్తూ ఆదిలాబాద్ ఎస్సీ, ఎస్టీ కోర్టు స్పెషల్ జడ్జి, రెండవ అధనపు జిల్లా జడ్జి శివరాం ప్రసాద్ బుధవారం తీర్పును వెలువరించారు.
వివరాల్లోకి వెళ్తే 2020 జూలై 30వ తేదిన ఫిర్యాదు దారుడు రామగిరి శ్రీపతికి న్యాయవాది కొత్త సత్తయ్య రూ.5లక్షలు ఇవ్వాల్సివుండగా కోర్టు ఆవరణలోని తన కార్యాలయానికి రావాలని చెప్పి, తన ఆఫీస్ కు వచ్చిన శ్రీపతితో పాటు తన ఇరువురి స్నేహితులను కర్రతో కొట్టడమే కాకుండా కులం పేరుతో దూషించాడని అప్పటి ఎస్ హెచ్ వో రాజమౌళి గౌడ్ కు బాధితుడు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.

అప్పటి ఇంచార్జి ఏసీపీ నరేందర్ విచారణ చేపట్టి ఎస్సీ, ఎస్టీ స్పెషల్ కోర్టు ఆదిలాబాద్ లో చార్జిషీటు దాఖలు చేశారు. నిందితుడిపై వచ్చిన ఆరోపణలు రుజువు చేయడానికి లైజన్ ఆఫీసర్ సయ్యద్ తాజోద్దీన్ సహకారంతో ఎస్సీ, ఎస్టీ కోర్టు ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ కిరణకుమార్ రెడ్డి 9 మంది సాక్షులను ప్రవేశ పెట్టి వాదనలు వినిపించి నేరాన్ని రుజువు చేయడంతో న్యాయమూర్తి నిందితుడికి జరిమానా విధిస్తూ తీర్పును వెలువరించారు. ఈ కేసు విషయమై ప్రాసిక్యూషన్ బృంధాన్ని రామగుండం సీపీ రెమా రాజేశ్వరి ప్రత్యేకంగా అభినందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement