Saturday, April 27, 2024

Ind vs Eng 1st Test : స్పిన్ ఉచ్చులో ఇంగ్లండ్.. 246కు ఆలౌట్..

హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ జట్ల మధ్య మొదటి టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ జట్లు 246 పరుగులకు ఆలౌట్ అయ్యింది. స్పిన్నర్ల ధాటికి ఇంగ్లండ్ బ్యాటర్లు పెవిలియన్ కు చేరుకున్నారు.

ఇండియా స్పినర్లు రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ లు చెరో మూడు వికెట్లు చొప్పున తీయగా, మరో స్పిన్నర్ అక్షర్ పటేల్ రెండు వికెట్లు, ఫాస్ట్ బౌలర్ జస్ప్రిత్ బుమ్రా రెండు వికెట్ల చొప్పున పడగొట్టారు. ఇంగ్లండ్ బ్యాట్స్ మెన్లు కెప్టెన్ బెన్ స్టోక్స్ 70 పరుగులు చేయగా… జానీ బెయిర్ స్టో 37 పరుగులు, బెన్ డక్కెట్ 35 పరుగులు, జో రూట్ 29 పరుగులు చేశారు. ఇవాళ మ్యాచ్ ప్రారంభమైనప్పటి నుంచి లంచ్ బ్రేక్ సమయానికి మూడు వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్, ఆ తర్వాత టీ బ్రేక్ సమయానికి ఎనిమిది వికెట్లు కోల్పోగా.. ఆ తర్వాత మరో రెండు వికెట్లు కోల్పోయి 246 పరుగులకు ఆలౌట్ అయ్యింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement