Friday, December 6, 2024

Divya Khosla: తెలుగు తెర‌కు కొత్త నాయకి….

దివ్య ఖోస్లా కుమార్ .. బాలీవుడ్ సర్కిల్స్‌లో పాపులర్ నేమ్. ఈ భామ కిల్లర్ లుక్స్, అద్భుత నటనతో భారీగా ఫాలోవర్స్‌ని సంపాదించుకుంది. ఈ పంజాబీ బ్యూటీ ‘అబ్ తుమ్హారే హవాలే వతన్ సాథియో` అనే హిందీ చిత్రంతో ఆరంగేట్రం చేసింది. ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ సరసన జతకట్టింది. ఆ తర్వాత సత్యమేవ జయతేలో నటించింది.

ఇందులో జాన్ అబ్రహం సరసన నటించింది. ఇటీవలే విడుదలైన యారియాన్ 2`తో దివ్యకు మంచి గుర్తింపు వచ్చింది. దివ్య ఖోస్లా సురేష్ కృష్ణ దర్శకత్వంలో ప్రేరణ అరోరా నిర్మిస్తున్న `హీరో హీరోయిన్‌`లో కథానాయికగా నటిస్తోంది. ఇప్పుడు దివ్య ఖోస్లా కుమార్ ఫస్ట్ లుక్ మొదటి పోస్టర్ విడుదలైంది. ఈ పోస్టర్ లో దివ్య ఎంతో అందంగా కనిపిస్తోంది. పోస్టర్ లో బ్లాక్ కలర్ సీతాకోక చిలుకను పోలిన డిజైనర్ డ్రెస్ లో దివ్య ఎంతో ముగ్ధ మనోహరంగా కనిపించింది. ఇక ఇది తెలుగు-హిందీ ద్విభాషా చిత్రమని టీమ్ పోస్టర్ లో ప్రత్యేకంగా వెల్లడించింది. తెలుగు వెర్షన్ కి `నాయకి అనే టైటిల్ ని ప్రకటించారు. ఈ చిత్రానికి సురేష్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ హిట్ అయితే టాలీవుడ్ లో పాగా వేయ‌డం ఖాయం.

Advertisement

తాజా వార్తలు

Advertisement