Wednesday, October 16, 2024

Funny Meme| నాకు దక్కకుంటే.. ఎవరికీ దక్కనీయను!

అహ్మదాబాద్​లో భారీ వర్షం కురుస్తున్న కారణంగా ఇవ్వాల (ఆదివారం) జరగాల్సిన ఫైనల్​ మ్యాచ్​  ఉంటుందా లేదా అనే గందరగోళం నెలకొంది.  రాత్రి 10 గంటలు దాటినా వర్షం ఆగకుండా కుండపోత కురుస్తోంది. దీంతో స్టేడియం పరిసరాలన్నీ నీటి కుంటలుగా మారిపోయాయి. 9.30 ప్రాంతంలో తగ్గినట్టే తగ్గిన వాన.. మరి కొద్దిసేపటికే కుండపోతగా మళ్లీ ప్రారంభమయ్యింది. స్టేడియం అవుట్​ ఫీల్డ్​ అంతా నీటితో నిండిపోయి పెద్ద చెరువులా మారింది. ఇవ్వాల ఆట కొనసాగడం కష్టమేనని స్పోర్ట్స్​ అనలిస్టులు చెబుతున్నారు.

ఇక.. ఈ ఫైనల్​ మ్యాచ్​ గురించి సోషల్​ మీడియాలో నెటిజన్లు మీమ్స్​ క్రియేట్​ చేసి వదిలారు. వాటిలో ముంబయి జట్టు యజమాని అంబానీ ఫోటోతో ఉన్న మీమ్​ అయితే తెగ నవ్వుపుట్టిస్తోంది. ‘‘నాకు కప్పు దక్కకుంటే ఎవరికీ దక్కనీయను”అనే క్యాప్షన్​తో ఈ మీమ్​ క్రియేట్​ చేశారు. ఈ మీమ్​లో అంబానీ నీటి పైపును పట్టుకుని స్టేడియంపై గుమ్మరిస్తున్నట్టు మీమర్స్​ భలేగా క్రియేట్​ చేశారు. మీరూ చూసి మనసారా నవ్వుకుని, షేర్​ చేయండి.. కామెంట్​ చేయండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement