Friday, October 11, 2024

తిరుపతి జిల్లాలో గాలివాన బీభత్సం.. కూలిన భారీ చెట్లు, ఇళ్లు

తిరుపతి, ప్రభన్యూస్‌ : చిత్తూరు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అకాల వర్షంతో రైతులకు జిల్లా ప్రజానీకానికి తీవ్ర నష్టం కలిగించింది. ఆదివారం మధ్యాహ్నం 100 కిలోమీటర్ల వేగంతో ఈదుర గాలులతో వర్షం కురిసింది. ఈదుర గాలుల వల్ల భారీ చెట్లు కూలాయి. చిత్తూరు. తిరుపతి నగరాలలో వడగళ్ళవాన పడింది. చిత్తూరు. తిరుపతి నగరంలోని భారీ హోర్ఢింగ్‌లు కూలిపోయాయి. చిత్తూరులో 45 నిమిషాల పాటు ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో నగరంలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమైయ్యాయి. వేలూరు రోడ్డులో వున్న విశాల మార్ట్‌ సమీపంలో గాలి వానకు విద్యుత్త్‌ వైర్తు తెగిపడి భారీ హోర్డింగ్‌లపై పడ్డాయి. సాయంత్రం 4గంటల నుంచి 3గంటల పాటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది.

తిరిగి రాత్రి 7గంటలకు కరెంట్‌ సరఫరా చేశారు. అక్కడక్కడ విద్యుత్‌ స్తంభాలు విరిగిపడ్డాయి. తిరుపతి నగరంతో పాటు ఓటేరు, కొరమేనుగుంట, తిరుపతి రూరల్‌, దేవుడు కాలనీతో పాటు మరికొన్ని లోతట్టు ప్రాంతాల్లో ఈదురు గాలుల వల్ల ఇళ్ళకు వున్న సిమెంట్‌ రేకులు లేచిపోయాయి. తిరుపతి రెండు ఇళ్ళులు కూలిపోగా, మరికొన్ని పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఏది ఏమైనా ఉరుములు, మెరుపులతో కూడిన అకాల వర్షం కురియడంతో ప్రజలు భయాందోళనలకు గురైయ్యారు. కొరమేనుగుంట ప్రాంతంలో గాలివాన భీభత్సవానికి 20కిపైగా రేకుల ఇళ్ళు కూలిపోయ్యాయి. దీంతో ఆయా ప్రాంతాల ప్రజలకు నిరాశయులై రోడ్డున పడ్డారు.

- Advertisement -

ఆస్తి నష్టం

ఈదుర గాలులతో కూడిన ఆకాల వర్షం కురియడంతో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో విద్యుత్‌ శాఖకు భారీ నష్టం వాటిల్లింది. చిత్తూరు. తిరుపతి నగరాలతో పాటు అక్కడక్కడ భారీ చెట్లు నెలకొరిగాయి. ప్రాణనష్టం ఎక్కడా సంబవించలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement