Sunday, May 19, 2024

షాట్‌గన్‌లో గనేమత్‌ శుభారంభం..

ఇటలీలోని నాటోలో జరుగుతున్న ఆరవ అంతర్జాతీయ షూటింగ్‌ స్పోర్ట్‌ ్స ఫెడరేషన్‌ (ఐఎస్‌ఎస్‌ఎఫ్‌) ప్రపంచకప్‌ షాట్‌గన్‌ పోటీల్లో భారత నంబర్‌ వన్‌ మహిళా స్కీట్‌ షూటర్‌ గనేమత్‌ సెఖోన్‌ శుభారంభం చేసింది. మొదటి రెండింటిలో రెండు లక్ష్యాలు గురితప్పింది. అయినప్పటికీ మరో మూడు రౌండ్‌లు మిగిలివుండగానే క్వాలిఫైయింగ్‌ రౌండ్‌లో ప్రస్తుతం 14వ స్థానంలో ఉంది. మొదటి ఆరు స్థానాల్లో నిలిచివారు ఫైనల్‌కు చేరుకుంటారు. రెండవ రౌండ్‌లో రెండు లక్ష్యాలు కోల్పోవడానికి ముందు మొదటి రౌండ్‌లో గనేమత్‌ 25 పాయింట్లు చేసింది.

మిగతా భారత షూటర్లలో మహేశ్వరి చౌహాన్‌ 46 పాయింట్లతో 26వ స్థానంతో ఉండగా, దర్శన రాథోడ్‌ 39 స్కోరుతో మరింత వెనుకబడివుంది. పురుషుల స్కీట్‌లో గుర్జోత్‌ ఖంగురా మాత్రమే రెండు రౌండ్లు పూర్తిచేసుకున్నాడు. ప్రస్తుతం 46 స్కోరుతో ఉన్నాడు. మంగళవారం మరో రెండు క్వాలిఫైయింగ్‌ రౌండ్లు ఉన్నాయి. బుధవారం ఫైనల్‌ రౌండ్‌ జరగనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement