Friday, May 17, 2024

Big Breaking |  ట్రాఫిక్​లో చిక్కుకున్న గవర్నర్​.. పోలీసుల సమన్వయలోపంతో ఇక్కట్లు!​

హైదరాబాద్​లో ఇవ్వాల (సోమవారం) రాత్రి గవర్నర్​ తమిళిసై ట్రాఫిక్​లో చిక్కుకుపోయారు. గవర్నర్​ ప్రయాణిస్తున్న వాహనం హెవీ ట్రాఫిక్​లో నిలిచిపోయింది. ఖైరతాబాద్​ హనుమాన్​ టెంపుల్​కు వచ్చిన గవర్నర్​ తిరుగు ప్రయాణంలో రాజ్​భవన్​ వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఖైరతాబాద్​, ఎర్రమంజిల్​ మార్గంలో పెద్ద ఎత్తున ట్రాఫిక్​ నిలిచిపోయింది. ట్రాఫిక్​ పోలీసుల సమన్వయంతోనే ఇట్లా జరిగిందని తెలుస్తోంది. కాగా, గవర్నర్​ భద్రతా సిబ్బంది ట్రాఫిక్​ని కంట్రోల్​ చేసే పనిలో నిమగ్నమయ్యారు.  

ఇక.. చలాన్లు వేయడంలో, వేహికల్స్​ని ఆపి ఫొటోలు తీయడంలో ఉన్న శ్రద్ధ ట్రాఫిక్​ని కంట్రోల్​ చేయడంలో చూపించడం లేదని, రోజూ 50 కేసుల టార్గెట్ల పేరుతో కానిస్టేబుళ్లను వేధింపులకు గురిచేస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ విషయంలో ఉన్నతాధికారులు చొరవ తీసుకుని అసలు విషయమ్మీద ఫోకస్​ పెట్టకపోతే గుడ్​ కాప్స్​ అన్న పేరు కాస్త బ్యాడ్​ కాప్స్​గా మారే ప్రమాదం ఉందని చాలామంది అంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement