Sunday, September 24, 2023

ధోనీ మోకాలి గాయం.. కోకిలాబెన్ ఆసుపత్రిలో చికిత్స

క్రికెట‌ర్ ధోనీ మోకాలి గాయంతో బాధ‌ప‌డుతున్నాడు. దాంతో ముంబై కోకిలాబెన్ ఆసుప‌త్రిలో ధోనీ చికిత్స తీసుకోనున్నార‌ని స‌మాచారం. కాగా ఈ గాయంతోనే ఈ ఐపీఎల్ సీజన్ లో ఆడాడు ధోని. మరో వారం రోజుల్లో చికిత్స ప్రారంభం అవుతుందట‌. ఐపీఎల్ ప్రారంభం సమయంలోనే ధోనీ మోకాలి గాయం గురించి చెన్నై కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ మాట్లాడాడు. ధోనీ మోకాలి గాయంతో బాధపడుతున్నాడని… అతని కదలికల్లో దాన్ని మనం గుర్తించవచ్చని అన్నాడు. మరోవైపు ఐపీఎల్ లో చెన్నై జట్టు ఐదోసారి ట్రోఫీని గెలుచుకుంది. ఇంకోవైపు తన రిటైర్మెంట్ కు సంబంధించి ధోనీ మాట్లాడుతూ, ఆట నుంచి పూర్తిగా విశ్రాంతి తీసుకోవడానికి ఇదే సరైన సమయమని…. అయితే అభిమానుల కోసం మరో ఐపీఎల్ లో ఆడతానని చెప్పాడు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement