Saturday, September 23, 2023

Basara IIIT : బాస‌ర ట్రిపుల్ ఐటీ ప్ర‌వేశాల‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల

బాసర ట్రిపుల్ ఐటీలో ప్ర‌వేశాల‌కు నోటిఫికేష‌న్ విడుద‌లైంది. ట్రిపుల్ ఐటీ నోటిఫికేష‌న్‌ను బాస‌ర ఆర్జీయూకేటీ ఈరోజు విడుద‌ల చేసింది. 6 ఏండ్ల ఇంజినీరింగ్ కోర్సులో ప్ర‌వేశాల‌కు నోటిఫికేష‌న్ జారీ చేసిన‌ట్లు తెలిపింది. జూన్ 5 నుంచి 19వ తేదీ వ‌ర‌కు అర్హులైన విద్యార్థులు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తులు స‌మ‌ర్పించొచ్చు.

- Advertisement -
   

పీహెచ్, ఎన్‌సీసీ, స్పోర్ట్స్ కోటా వారికి జూన్ 24 వ‌ర‌కు ద‌ర‌ఖాస్తుల‌కు అవ‌కాశం క‌ల్పించారు. జూన్ 26వ తేదీన మెరిట్ జాబితాను విడుద‌ల చేస్తామ‌ని బాస‌ర ట్రిపుల్ ఐటీ వీసీ వెంక‌ట‌ర‌మ‌ణ పేర్కొన్నారు. ఎంపికైన అభ్యర్థులు జులై 1న రిపోర్ట్‌ చేయాల్సి ఉంటుంది. ఓసీ, ఓబీసీ విద్యార్థులకు దరఖాస్తు ఫీజుగా రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.450 చెల్లించాలి. పదో తరగతిలో వచ్చే మార్కుల (జీపీఏ) ఆధారంగానే సీట్లు కేటాయించనున్నట్లు ఆర్జీయూకేటీ వీసీ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement