Saturday, April 27, 2024

WPL : డబ్ల్యూపీఎల్‌లో పైన‌ల్ లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ ..

డబ్ల్యూపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ దుమ్మురేపింది. భారీ విజయం లక్ష్యంగా బరిలోకి దిగిన ఢిల్లీ అనుకున్న ఫలితాన్ని అందుకుంది. గ‌త రాత్రి పూర్తి ఏకపక్షంగా సాగిన పోరులో ఢిల్లీ 7 వికెట్ల తేడాతో గుజరాత్‌ జెయింట్స్‌పై ఘన విజయం సాధించింది. దీంతో లీగ్‌ ఫైనల్లోకి ప్రవేశించింది.

గుజరాత్‌ నిర్దేశించిన 127 పరుగుల లక్ష్యఛేదనలో ఢిల్లీ 13.1 ఓవర్లలో 129/3 స్కోరు చేసింది. ఓపెనర్‌ షెఫాలీవర్మ(37 బంతుల్లో 71, 7ఫోర్లు, 5 సిక్స్‌లు) అర్ధసెంచరీతో విజృంభించగా, జెమీమా రోడ్రిగ్స్‌(38 నాటౌట్‌) దూకుడుగా ఆడింది. తనూజ కన్వర్‌(2/20) రెండు వికెట్లు తీసింది. అంతకుముందు ఢిల్లీ 20 ఓవర్లలో 126/9 స్వల్ప స్కోరుకే కుప్పకూలింది. కాప్‌(2/17), మిన్ను మణి(2/9), శిఖాపాండే(2/23) ధాటికి గుజరాత్‌ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. భారతి ఫల్మాలీ(42) మినహా అందరూ ఘోరంగా విఫలమయ్యారు. షెఫాలీకి ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ దక్కింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement