Sunday, April 28, 2024

Bairstow : పంజాబ్ కింగ్స్ కు గుడ్ న్యూస్

భారత్‌లో సుదీర్ఘ టెస్టు సిరీస్‌ను ముగించుకుని ఇటీవలే స్వదేశానికి వెళ్లినప్పటికీ ఇంగ్లాండ్‌ బ్యాటర్‌ బెయిర్‌స్టో ఈ ఐపీఎల్‌ సీజన్‌ మొత్తానికి పంజాబ్‌ కింగ్స్‌ జట్టుకు అందుబాటులో ఉంటాడు. ”బెయిర్‌స్టో ఈ నెల 18 లేదా 19న భారత్‌కు వస్తాడు.

- Advertisement -

మార్చి 23న పంజాబ్‌ తొలి మ్యాచ్ కు అందుబాటులో ఉంటాడు” అని ఐపీఎల్‌ వర్గాలు తెలిపాయి. ఇంగ్లాండ్‌ ఆటగాళ్లు ఐపీఎల్‌కు అందుబాటులో ఉండడం గురించి బీసీసీఐ అధికారులు.. అయిదో టెస్టు సందర్భంగా ఈసీబీ అధికారులతో మాట్లాడారు. బెన్‌ స్టోక్స్‌, రూట్‌, మార్క్‌ వుడ్‌ ఇప్పటికే ఐపీఎల్‌కు దూరమైన సంగతి తెలిసిందే. మరోవైపు బ్యాటింగ్‌ సలహాదారుగా వసీం జాఫర్‌ను కొనసాగించరాదని పంజాబ్‌ ఫ్రాంఛైజీ నిర్ణయించింది. ఆ జట్టు క్రికెట్‌ డైరెక్టర్‌ సంజయ్‌ బంగర్‌ ఈ సీజన్‌కు బ్యాటింగ్‌ కోచ్‌గా కూడా పని చేస్తాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement