Tuesday, May 7, 2024

Harry Brooke: నాలుగు కోట్ల‌కు కొన్న ప్లేయ‌ర్ ఔట్..

ఇంగ్లాండ్‌ బ్యాటర్‌ హారీ బ్రూక్‌ ఐపీఎల్‌కు దూరమయ్యాడు. గత నెలలో తన నానమ్మ చనిపోవడంతో శోకంలో ఉన్న కుటుంబంతో ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అతడు తెలిపాడు.

వేలంలో దిల్లీ క్యాపిటల్స్‌ అతణ్ని రూ.4 కోట్లకు కొనుక్కుంది. బ్రూక్‌.. భారత్‌తో టెస్టు సిరీస్‌ నుంచి కూడా చివరి క్షణంలో వైదొలిగాడు. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తరఫున గత సీజన్‌లో బ్రూక్‌ 21 సగటుతో 190 పరుగులు మాత్రమే చేశాడు. అయితే ఓ మ్యాచ్‌లో 55 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. తాజా సీజ‌న్ లో అత‌డిని ఢిల్లీ కొనుగోలు చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement