Wednesday, May 15, 2024

డేల్ స్టెయిన్ ఆల్‌-టైం ఎలెవన్ లో సచిన్, సెహ్వాగ్..

సౌతాఫ్రికా క్రికెట్ చరిత్రలో టాప్ క్లాస్ స్టార్ పేసర్‌గా గుర్తింపు తెచ్చుకున్న డేల్ స్టెయిన్ తన ఆల్‌-టైం బెస్ట్ ఎలెవన్ టీమ్‌ను ప్రకటించాడు. ఈ టీమ్ దక్షిణాప్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్‌ను తన టీమ్‌కి కెప్టెన్‌గా, ఓపెనర్‌గా ఎంచుకున్నాడు. గ్రేమ్ స్మిత్‌తో పాటు వీరేంద్ర సెహ్వాగ్ ఓపెనర్‌గా వస్తాడు. మూడో స్థానంలో సౌతాఫ్రికా మాజీ సెన్సేషన్ హషీం ఆమ్లాను ఎంపిక చేశాడు స్టెయిన్. నాలుగో స్థానంలో సచిన్ టెండూల్కర్, ఐదో స్థానంలో సఫారీ ఆల్‌రౌండర్ జాక్వస్ కలీస్, ఆరో స్థానంలో శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగర్కరను ఎంపిక చేశాడు..ఏడో స్థానంలో సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ ఏబీ డివిల్లియర్స్, ఆ తర్వాత ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ ఆండ్రూ ఫ్లింటాఫ్, ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ షేన్ వార్న్‌ను ఎంచుకున్నాడు డేల్ స్టెయిన్. పాక్ మాజీ పేసర్ వసీం అక్రమ్, ఆసీస్ స్టార్ పేసర్ గ్లెన్ మెక్‌గ్రాత్‌లను 11 మంది జట్టులో పేసర్లుగా ఎంచుకున్న స్టెయిన్, ఆలెన్ డొనాల్డ్, జాంటీ రోడ్స్‌లకు ఎక్స్‌ట్రా ప్లేయర్లుగా చోటు కల్పించాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement