Sunday, April 28, 2024

హైదరాబాద్ లో దంచికొట్టిన వర్షం.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిక

హైదరాబాదులో వాతావరణం మారిపోయింది. నగరంలో భారీ వర్షం కురిసింది. అమీర్ పేట్, పంజాగుట్ట, కోఠి, అబిడ్స్, లక్డీకాపూల్, సుల్తాన్ బజార్, బేగంబజార్,  ఖైరతాబాద్, నారాయణగూడ, కూకట్ పల్లి తదితర ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది. వనస్థలిపురం, అబ్దుల్లాపూర్ మెట్, నాగోల్, హయత్ నగర్, ఎల్బీనగర్, మన్సూరాబాద్ ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురవగా, గచ్చీబౌలి, మియాపూర్, మాదాపూర్ ప్రాంతాల్లో జల్లులు కురిశాయి. అనేక ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిలిచిపోయింది. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఆగిపోయింది. సికింద్రాబాద్, అల్వాల్ ప్రాంతాలలో 20.8 మిమీ, 21.8 మిమీ వర్షపాతం నమోదైంది. నగరంలోని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.

తెలంగాణలో రేపు కూడా వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, వరంగల్, వికారాబాద్, సూర్యపేట, సంగారెడ్డి, మెదక్, వనపర్తి, నాగర్ కర్నూల్, నల్గొండ, భద్రాది కొత్తగూడెం, మహబూబాబాద్, ములుగు, మంచిర్యాల, నారాయణపేట జిల్లాల్లో తేలికపాటి నుండి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement