Saturday, December 7, 2024

Cricket Fan – ఆ అభిమానానికి కంగు తిన్న రోహిత్ శ‌ర్మ ..

హైదరాబాద్‌ వేదికగా తొలి టెస్టులో భారత్‌-ఇంగ్లండ్‌ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌ తొలి రోజు ఆట సందర్భంగా ఓ అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ఓ అభిమాని సెక్యూరిటీ సిబ్బంది కళ్లుగప్పి మైదానంలోకి దూసుకెళ్లాడు. గ్రౌండ్‌లోకి వచ్చిన ఆ అభిమాని టీమిండియా సారథి రోహిత్ శర్మ కాళ్ళు మొక్కాడు. హిట్‌ మ్యాన్‌ వద్దు వారిస్తున్నప్పటికీ అభిమాని మాత్రం వినిపించుకోలేదు. అయితే వెంటనే అప్రమత్తమైన సిబ్బంది అతడిని మైదానం నుంచి బయటకు తీసుకు వెళ్లారు. కాగా గతంలో కూడా ఇటువంటి సంఘటనలు చాలా జరిగాయి.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 246 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్‌ బ్యాటర్లలో బెన్‌ స్టోక్స్‌ 70 పరుగులతో కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా, అశ్విన్‌ తలా 3 వికెట్లతో ఇంగ్లండ్‌ పతనాన్ని శాసించగా.. అక్షర్‌ పటేల్‌, బుమ్రా చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ఇక బ్యాటింగ్ ప్రారంభించిన భార‌త్ ప‌రుగుల వ‌ర‌ద పారించింది.. యువ ఓపెన‌ర్ య‌శ‌స్వీ జైస్వాల్ ఫోర్లు,సిక్స‌ర్ల‌తో విరుచుకుప‌డ్డాడు.. ఇంగ్లండ్ స్పిన్న‌ర్ల‌న ఊచ‌కోత కోశాడు..మూడు సిక్స్ లు ,తొమ్మిది ఫోర్ల‌తో 76 ప‌రుగుల‌తో అజేయంగా ఆడుతున్నాడు.. అతడికి తోడుగా శుభ‌మ‌న్ గిల్ క్రీజ్ లో ఉన్నాడు.. రోహిత్ 24 ప‌రుగులు చేసి లీచ్ బౌలింగ్ లో ఔట‌య్యాడు. ఆట ముగిసే సమయానికి భారత్ ఒక వికెట్ నష్టానికి 119 పరుగులు చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement