Saturday, April 27, 2024

బట్లర్ ఔట్ – రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌ 47/1

బెంగళూర్ – రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌కు షాక్.. విధ్వంస‌క ఓపెన‌ర్ జోస్ బ‌ట్ల‌ర్(0)ను సిరాజ్ బౌల్డ్ చేశాడు. నాలుగో బంతిని డిఫెండ్ చేయ‌బోయిన బ‌ట్ల‌ర్ అంచ‌నా త‌ప్పింది. బంతి వికెట్ల‌ను తాకింది. దాంతో, 1 ప‌రుగు వద్ద ఆ జ‌ట్టు తొలి వికెట్ ప‌డింది. య‌శ‌స్వీ జైస్వాల్ 27, పడిక్కల్ 21 పరుగుల తో క్రీజులో ఉన్నాడు ఓవర్ లలో ఆర్ ఆర్ ఒక వికెట్ నష్టానికి 47 పరుగుల చేసింది

అంతకు ముందు బెంగళూరు కెప్టెన్ ఫాఫ్ డూప్లెసిస్(62), గ్లెన్ మ్యాక్స్‌వెల్(77) అర్థ శ‌త‌కం బాదారు. దాంతో, నిర్ధారిత 20 ఓవర్ లలో ఆర్సీబీ9 వికెట్ల న‌ష్టానికి 189 ప‌రుగులు చేసింది. సూప‌ర్ ఫామ్‌లో ఉన్న విరాట్ కోహ్లీ తొలి బంతికే డ‌కౌటయ్యాడు. ఆ త‌ర్వాత డూప్లెసిస్, మ్యాక్స్‌వెల్ వేగంగా ఆడారు. 11 ఓవ‌ర్ల‌కు స్కోర్ వంద దాటించారు. హాఫ్ సెంచ‌రీ త‌ర్వాత జోరు పెంచిన వీళ్లిద్ద‌రు వెంట వెంట‌నే ఔటయ్యారు. ఆ త‌ర్వాత‌ ఆర్సీబీ ప‌రుగుల వేగం త‌గ్గింది. చివ‌ర్లో దినేశ్ కార్తిక్(16), మ‌హిపాల్ లొమ్‌రోర్(8), వ‌నిందు హ‌స‌రంగ‌(6) ధాటిగా ఆడడంతో 180 ప్ల‌స్ చేయ‌గ‌లిగింది

Advertisement

తాజా వార్తలు

Advertisement