Sunday, May 12, 2024

టెన్నిస్‌ క్రీడాకారిణి శ్రీజకు అన్ని విధాలా సహకారం.. మంత్రి కేటీఆర్‌ భరోసా..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : యూకేలోని బర్మింగ్‌హామ్‌లో జరగనున్న కామన్‌వెల్త్‌ క్రీడల్లో తెలంగాణకు చెందిన టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి శ్రీజ ఆకుల భారత్‌ తరపున ప్రాతినిథ్యం వహించనున్నది. ఈ సందర్భంగా సోమవారం శ్రీజ కోచ్‌తో కలిసి ప్రగతిభవన్‌లో రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్‌ను కలిసింది. కామన్‌వెల్త్‌ క్రీడల్లో పాల్గొనేందుకు అవసరమైన ప్రయాణ, సామాగ్రిసహా అన్ని విధాలా సహాయసహకారాలు అందిస్తామని మంత్రి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.

తెలంగాణ రాష్ట్రం నుంచి తొలిసారిగా మహిళా జీతీయ ఛాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచిందుకు శ్రీజను, అలాగే కోచ్‌ సోమనాథ్‌ ఘోషను కేటీఆర్‌ అభినందించారు. టేబుల్‌టెన్నిస్‌ను రాష్ట్రంలో ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం డిప్యూటేషన్‌పై కోచ్‌ సోమనాథ్‌ ఘోష్‌ను నియమించిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్‌, చీఫ్‌ రిలేషన్స్‌ ఆఫీసర్‌ అమర్‌నాథ్‌రెడ్డి ఆత్మకూరి, తెలంగాణ రాష్ట్ర టేబుల్‌ టెన్నిస్‌ అసోసియేషన్‌ కార్యదర్శి ప్రకాశ్‌రాజు తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement