Wednesday, May 1, 2024

Indoor Athletics | రేపటి నుంచే ఆసియా ఇండోర్‌ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్

ఆసియా ఇండోర్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్ 2024 11 ఎడిష‌న్ పోటీలకు తెలుగు మ‌మ్మాయి జ్యోతి యర్రాజి ఎంపికయ్యారు. విశాఖపట్నం జిల్లాకు చెంది జ్యోతి యర్రాజి భారతదేశం తరపున ఆసియా ఇండోర్‌ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌ షిప్‌ పోటీల్లో పాల్గొననుంది. ఈపోటీలు ఈనెల ఇరాన్‌లో 17 నుంచి మూడురోజుల పాటు జరగనున్నాయి. ఈపోటీల్లో పాల్గొనేందుకు భార‌త్ నుంచి 15 మంది సభ్యులతోకూడిన బృందం హాజరుకానుంది. అంతర్జాతీయ క్రీడాకారిణి జ్యోతి యర్రాజి 60 మీటర్లు హార్డిల్స్‌, 60 మీటర్లు ప్లాట్‌ ఈవెంట్లలలో భారతదేశం తరపున ఎంపికైయ్యారు.

ఆసియా ఇండోర్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ లో భారత జట్టు ఇదే !

మ‌హిళ‌లు

జ్యోతి యర్రాజీ (60మీ హర్డిల్స్), హర్మిలన్ బెయిన్స్ (1500మీ), అంకిత (3000మీ), నయన జేమ్స్ (లాంగ్ జంప్), శైలి సింగ్ (లాంగ్ జంప్), పూజ (హైజంప్), పవిత్ర వెంకటేష్ (పోల్ వాల్ట్), ఇ బరానికా (పోల్ వాల్ట్)

- Advertisement -

పురుషులు

వికె ఎలక్కియదాసన్ (60మీ), తేజస్ అశోక్ షిర్సే (60మీ హర్డిల్స్), మహ్మద్ అఫ్సల్ (800మీ), అజయ్ కుమార్ సరోజ్ (1500మీ), గుల్వీర్ సింగ్ (3000మీ), తజిందర్‌పాల్ సింగ్ టూర్ (షాట్‌పుట్), ధన్వీర్ (షాట్‌పుట్)

Advertisement

తాజా వార్తలు

Advertisement