Thursday, October 3, 2024

Ind vs Eng : చితక్కొట్టిన బ్యాటర్స్.. భారీ స్కోర్ దిశగా ఇంగ్లండ్

రాజ్ కోట్ సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో భారత్ వర్సెస్ ఇంగ్లండ్ జట్ల మధ్య మూడో టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేపట్టిన భారత్ జట్టు 445 పరుగులకు ఆలౌట్ అయ్యింది.

అయితే ఈ మ్యాచ్ లో ఇంగ్లండ్ బ్యాటర్స్ చితక్కొట్టారు. ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్ టీ 20 మ్యాచ్ లో ఆడినట్లు ఆడారు. 118 బంతుల్లో 21ఫోర్లు, రెండు సిక్సర్లతో 133 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఇంగ్లండ్ జట్టు రెండో రోజు ఆట ముగిసే సమయానికి రెండు వికెట్లు కోల్పోయి.. 35ఓవర్లలో 207 పరుగులు చేశారు. ఒల్లీ పోప్ 39 పరుగులు, క్రాలే 15 పరుగులు చేసి ఔట్ కాగా, జో రూట్ తొమ్మిది పరుగులు, డకెట్ 133 పరుగులతో నాటౌట్ గా ఉన్నారు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ జట్టు 238 పరుగుల లీడ్ లో ఉంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement