Monday, May 13, 2024

Devara రిలీజ్ డేట్ ఫిక్స్ !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో, కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘దేవర’. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండ‌గా.. సైఫ్ అలీఖాన్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమానుంచి రిలీజ్ అయిన టీజ‌ర్‌‌తో సినిమాపై ప్రేక్షకుల, అభిమానులలో మరింత హైప్ క్రియేట్ అయ్యింది.

కాగా, తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్‌పై అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమా అక్టోబర్ 10న థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. దేవర పార్ట్ 1 పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమాకి అనిరుద్ రవి చందర్ సంగీతం అందిస్తుండగా.. యువ సుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లపై సుధాకర్ మిక్కిలినేని, కే. హరికృష్ణ, నందమూరి కళ్యాణ్ రామ్ లు ఈ సినిమాని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement