Tuesday, May 14, 2024

Nivetha Pethuraj | ఆటల్లోనూ సత్తాచాటుతున్న నటి నివేదా పేతురాజ్..

ప్రముఖ సినీనటి నివేతా పేతురాజ్ క్రీడ‌ల్లోనూ సత్తాచాటింది. తమిళనాడులో జరిగిన రాష్ట్రస్థాయి బాడ్మింటన్‌ పోటీల్లో నటి నివేతా విజేతగా నిలిచింది. మధురైకు ప్రాతినిథ్యం వహించిన‌ నివేతా.. మిక్స్‌డ్‌ డబుల్స్‌ ఫైనల్లో ప్రత్యర్థి జంటపై గెలిచి ఛాంపియన్‌గా నిలిచింది. మిక్స్‌డ్‌ డబుల్స్ లో తన సహచర ఆటగాడితో కలిసి ట్రోఫీతో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది నివేతా.

ఓవైపు హీరోయిన్‏గా సినిమాల్లో నటిస్తూనే నివేదా పేతురాజ్ ఇప్పటికే ఎఫ్ 1 కార్ రేసర్ గా పలు పతకాలు సాధించింది. అయితే తాజాగా స్టేట్ లెవెల్ బ్యాడ్మింటన్ పోటీల్లో గోల్డ్ సాధించింది. ఇక దీంతో సినిమాలతో పాటు ఆటల్లోనూ రాణిస్తున్నా నివేతాకు పెద్దఎత్తున అభిమానులు అభినందలు తెలుపుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement