Sunday, April 28, 2024

WPL | గుజరాత్‌కు ఎదురుదెబ్బ.. గాయంతో దూరమైన హర్లీన్‌..

వరుస పరాజయాలతో డబ్ల్యూపీఎల్‌ సీజన్‌ 2లో ఘోరంగా విఫలమవుతున్న గుజరాత్‌ జెయింట్స్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్‌ బ్యాటర్‌ హర్లీన్‌ డియోల్‌ మోకాలి గాయం కారణంగా మొత్తం టోర్నీకి దూరమైంది. మూడు మ్యాచ్‌లు ఆడిన డియోల్‌ 48 పరుగులు చేసింది. ఇక మిగిలిన సీజన్‌ కోసం హర్లిన్‌ స్థానాన్ని మరో టీమిండియా బ్యాటర్‌ భారతి ఫుల్మతితో భర్తీ చేస్తున్నట్లు గుజరాత్‌ మేనేజ్‌మెంట్‌ ప్రకటించింది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 5 మ్యాచ్‌లు ఆడిన గుజరాత్‌ జెయింట్స్‌ కేవలం ఒక్క విజయం సాధించింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఈ జట్టు చివరి స్థానంలో నిలిచింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement