Wednesday, May 15, 2024

1983 గెలుపు భారత్‌ అదృష్టం.. వెస్టిండీస్‌ గ్రేట్‌ ఆండీ రాబర్ట్స్‌ వ్యాఖ్యలు

జూన్‌లో జరిగిన ఐసీసీ వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌లో పేలవ ప్రదర్శన చేసిన రో#హత్‌ శర్మ బృందాన్ని నిందించిన వెస్టిండీస్‌ గ్రేట్‌ సర్‌ ఆండీ రాబర్ట్‌ ్స మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఒక ఇంటర్వ్యూలో, మాట్లాడుతూ, భారతదేశం మిగతా ప్రపంచాన్ని తక్కువ అంచనా వేస్తోందని, అ#హంకారం వైపుకు ప్రవేశించిందని, ఇది నిరంతరం ఎదురుదెబ్బలకు దారితీస్తుందని హెచ్చరించాడు. 2013లో భారత్‌ చివరిసారిగా ఐసీసీ ట్రోఫీని గెలుచుకోవడం గమనార్హం అని పేర్కొన్నాడు.

కపిల్‌ దేవ్‌ నేతృత్వంలోని 1983 ప్రపంచ కప్‌ గెలిచిన భారత జట్టును లక్ష్యంగా చేసుకుని కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆ సమయంలో 24 సంవత్సరాల వయస్సులో ఉన్న దేవ్‌, ఎలాంటి నాయకత్వ అనుభవం లేకుండా గొప్ప విజయాన్ని దక్కించుకున్నాడు. అంతేకాదు, అంతకుముందు 1975, 1979లో జరిగిన రెండు ప్రపంచకప్‌లలో భారత్‌ కేవలం ఒక్క విజయం మాత్రమే సాధించింది. ఆ రెండు ఎడిషన్లలో వెస్టిండీస్‌ ట్రోఫీని గెలుచుకుంది. అలాంటి వెస్టిండీస్‌ను ఓడించి కప్‌ గెలవడం వారి అదృష్టమనే అని చెప్పుకొచ్చాడు.

- Advertisement -

1983 ప్రపంచ కప్‌లో, జింబాబ్వేతో పాటు వెస్టిండీస్‌, ఆస్ట్రేలియాతో భారత్‌ ఆడింది.ఈ ఫార్మాట్‌ ప్రకారం లీగ్‌ దశలో అన్ని జట్లు ఒకదానితో ఒకటి రెండుసార్లు ఆడాలి. ఈ క్రమంలో రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన విండీస్‌ను భారత జట్టు 34 పరుగుల తేడాతో ఓడించి అసంభవమైన ఆరంభాన్ని పొందింది. తర్వాతి మ్యాచ్‌లో వారు వారు వెస్టిండీస్‌ చేతిలో ఓడిపోయినప్పటికీ, జింబాబ్వేను రెండుసార్లు, ఆస్ట్రేలియాను ఒకసారి ఓడించి సెమీస్‌కు చేరుకున్నారు. అక్కడ ఆతిథ్య ఇంగ్లాండ్‌ను ఓడించి కరేబియన్‌ దిగ్గజాలతో ఫైనల్‌కు సిద్ధమయ్యారు.

లార్డ్స్‌లో జరిగిన ఫైనల్లో, మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్‌, క్రిస్‌ శ్రీకాంత్‌తో అత్యధిక వ్యక్తిగత స్కోరు 38 పరుగులతో 183 రన్స్‌చేసింది. భారతదేశం గొప్ప ఆరంభాన్ని పొందింది. వెస్టిండీస్‌పై ఒత్తిడిని కొనసాగించింది. విండీస్‌ను 140 పరుగులకే ఆలౌట్‌ చేసింది. అప్పటి విండీస్‌ జట్టులో పేస్‌ దళానికి ఆండీ రాబర్ట్‌ ్స నాయకత్వం వహించడం విశేషం. తమపై విజయంతో భారత్‌ను అదృష్టం వరించిందన్నాడు. ‘మేము ఫామ్‌లో ఉన్నాము. కానీ ఒక చెత్తగేమ్‌ కారణంగా 1983లో భారత్‌ దశ తిరిగింది. 1983లో రెండు గేమ్‌లను భారత్‌తో ఓడిపోయాము. ఆపై, ఐదు లేదా ఆరు నెలల తర్వాత, మేము భారత్‌ను 6-0తో ఓడించామని గుర్తుచేశాడు. వెస్టిండీస్‌ తరపున రాబర్ట్స్‌ 47 టెస్టులు, 56 వన్డేలు ఆడాడు. టెస్టుల్లో 202, వన్డేల్లో 87 వికెట్లు తీశాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement