Monday, May 6, 2024

ఎలైట్‌ ప్రొ బాస్కెట్‌బాల్‌ వైల్డ్‌కార్డ్‌కు.. 1200 మంది రిజిస్ట్రేషన్‌

భారతదేశపు మొట్టమొదటి ప్రొ బాస్కెట్‌బాల్‌ లీగ్‌ ట్రై అవుట్‌లకు విశేష స్పందన లభిస్తోంది. ఇప్పటి వరకు 1200 మంది అథ్లెట్లు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. చెన్నై, ఢిల్లిd నగరాలలో ఈట్రై అవుట్స్‌ను నిర్వహిస్తున్నారు. చెన్నై ట్రై అవుట్‌ అక్టోబర్‌ 8-10 మధ్య, ఢిల్లిd ట్రై అవుట్‌ అక్టోబర్‌ 28- నవంబర్‌ 3 మధ్య జరుగుతాయి. ఎలైట్‌ ప్రొ బాస్కెట్‌బాల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ నిర్వహించే ఈ లీగ్‌లో ఇప్పటికే 12 మంది మార్క్యూ ప్లేయర్లు ఒప్పందం చేసుకున్నారు. లీగ్‌లో ఆడే మరో 100మంది ఆటగాళ్లతో నిర్వాహకులు ఒప్పందాలు చేసుకున్నారు.

ఓపెన్‌ వైల్డ్‌కార్డ్‌ ట్రై అవుట్‌లను సోషల్‌ మీడియాలో ప్రకటించిన తర్వాత, విపరీతమైన స్పందన లభించిందని ఎలైట్‌ ప్రొ బాస్కెట్‌బాల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సీఈవో సన్నీ భండార్కర్‌ వెల్లడించారు. బాస్కెట్‌బాల్‌ అథ్లెట్లు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి, ప్రొఫెషనల్‌గా మారడానికి మేము ఒక వేదికను అందిస్తున్నాం. ఈ లీగ్‌ద్వారా ప్రతి ఒక్కరి మద్దతుతో దేశంలో బాస్కెట్‌బాల్‌ క్రీడలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలని అనుకుంటున్నాం అని భండార్కర్‌ వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement